వధువుకి పక్షవాతం.. ఎత్తుకొనివెళ్లి మరీ పెళ్లి చేసుకున్న వరుడు...!

Published : Dec 07, 2022, 09:40 AM IST
 వధువుకి పక్షవాతం.. ఎత్తుకొనివెళ్లి మరీ పెళ్లి చేసుకున్న వరుడు...!

సారాంశం

మరి కొద్ది రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా... ఆరు నెలల క్రితం ఆమె పక్షవాతానికి గురైంది. దీంతో... ఆమె కదల్లేని స్థితికి వెళ్లిపోయింది.   

శరీరంలో చిన్న లోపం ఉన్నా... చాలా మంది వారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అలాంది ఓ వ్యక్తి.... తాను ఇష్టపడిన అమ్మాయికి పక్షవాతం వచ్చి.. కదలలేని స్థితిలో ఉన్నా కూడా  ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పినా.. ఎదురించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కి చెందిన మహావీర్ అనే యువకుడికి  రీన్లాబా అనే యువతితో మూడేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఇష్టపడటంతో... ఇంట్లో వారి అనుమతితో నిశ్చితార్థం చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో వారి పెళ్లి జరగాల్సి ఉండగా... ఆరు నెలల క్రితం ఆమె పక్షవాతానికి గురైంది. దీంతో... ఆమె కదల్లేని స్థితికి వెళ్లిపోయింది. 

 రీన్లాబా తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ చెట్టుకింద పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె శరీరం యొక్క దిగువ భాగాన్ని కదల్చలేని విధంగా ఆమె గాయాలు తీవ్రంగా ఉన్నాయి. 

దీంతో... వారి పెళ్లి రద్దు చేయాలని వరుడు కుటుంబసభ్యులు భావించారు. కానీ... అతను మాత్రం అంగీకరించలేదు. ఆమెను తాను ఇష్టపడ్డానని... ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటానని బీష్మించుకు కూర్చున్నాడు. ఎవరు కాదన్నా.. వినకుండా... తన ప్రేమను ఆమెకు తెలియజేసి.. డిసెంబర్ 1వ తేదీన వారు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ.. పెళ్లి చేసుకోవడం గమనార్హం. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?