తమిళనాడు చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Published : Dec 07, 2022, 09:14 AM ISTUpdated : Dec 07, 2022, 09:39 AM IST
తమిళనాడు చెంగల్పట్టులో  రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో బుధవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. టాటా ఏస్ వాహనం మరో రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టులో  బుధవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  రాష్ట్రంలోని  చెంగల్పట్టు జిల్లా మధురాండకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై  టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న  ట్రక్కును ఢీకొట్టిందిఅయితే అదే సమయంలో టాటా ఏస్ వాహనాన్ని వెనక నుండి వచ్చి మరో వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాల మధ్య టాటా ఏస్ వాహనం ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనంలోని ఆరుగురు మృతి చెందారు.

అన్నామలైయార్ కార్తీక దీపోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంతో ఈ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతదేహాలను  చెంగల్పట్టు ప్రబుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో  పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహలను బంధువులకు అప్పగించనున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో శేఖర్, శశికుమార్, యెహుమలై, చంద్రశేఖర్, దామోదరన్,   గోకుల్ లు మృతి చెందారు.ఈ ప్రమాదంలో అయ్యనార్, రామ్మూర్తి, రవి, శేఖర్, సతీష్ కుమార్ లు గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?