దారుణం.. భర్తతో వివాహేతర సంబంధం.. భార్యపై యాసిడ్ దాడి.. ఓ మహిళ ఘాతుకం...

Published : Dec 07, 2022, 09:09 AM IST
దారుణం.. భర్తతో వివాహేతర సంబంధం.. భార్యపై యాసిడ్ దాడి.. ఓ మహిళ ఘాతుకం...

సారాంశం

భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువతి.. అది ప్రశ్నించిందని భార్య, ఆమె కుమారుడి మీద యాసిడ్ తో దాడి చేసింది. 

మహారాష్ట్ర : ప్రేమను నిరాకరించిందనో..  తనను అవమానించిందనో.. అమ్మాయిల మీద యాసిడ్ దాడులకు తెగబడిన ఘటనలు చూశాం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి  ప్రాణాలు కోల్పోయిన అమ్మాయిలు ఎందరో. ఇలాంటి ఘటనలు ఎక్కువ అవడంతో ప్రభుత్వం యాసిడ్ వాడకాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ మహిళ మరో మహిళపై  యాసిడ్ తో దాడి చేసింది. 

ఓ వివాహిత వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువతి..  అతడి భార్య  ప్రశ్నించిందని  ఆసిడ్ తో  దాడికి దిగింది. భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని.. అతడిని, ప్రియురాలిని కొట్టిన ఘటనలు..  పోలీసు కేసులు… హత్య చేసిన  ఉదంతాలు  తెలుసు.  కానీ,  తన భర్తతో ఎందుకు చనువుగా ఉన్నావని ప్రశ్నించినందుకు.. ఆ ప్రియురాలు  ఘాతుకానికి తెగించింది. పో 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది.  గత శనివారం ఉదయం మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ దాడిలో  సదరు మహిళ,  ఆమె రెండున్నర ఏళ్ళ కొడుకు  తీవ్ర గాయాలపాలయ్యారు.

అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ ముఠా గుట్టు రట్టు:17 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాము దొరకకుండా ఉండాలని వారు చేసిన ప్లాన్ కూడా బయటపడింది.  ఇద్దరు మహిళలు  స్కూటీ మీద  బుర్ఖాలు వేసుకుని  బాధితుల వద్దకు వచ్చారు.  ఆ తర్వాత ఒక్కసారిగా వారి మీద యాసిడ్తో దాడి చేశారు.  ఆ సమయంలో మహిళ ఒడిలో  రెండున్నర ఏళ్ల చిన్నారి ఉన్నాడు.  దీంతో ఇద్దరు యాసిడ్ బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యారు. ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా యాసిడ్ దాడి చేసి అక్కడినుంచి మాయమయ్యారు వారిద్దరూ. అయితే ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త ప్రియురాలు తన స్నేహితురాలితో కలిసి.. అతని భార్య ఆమె కుమారుడి పై దాడి చేసింది. Fpdd దాడి తర్వాత బాధితురాలి అరుపులకు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరికీ ముఖం పై తీవ్ర గాయాలయ్యాయి’ అని యశోద నగర్ పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన దృశ్యాలు.. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితురాలు ఆమె స్నేహితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిమీద సెక్షన్ 326ఏ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?