పెళ్లి ఊరేగింపులో.. వరుడిపై కాల్పులు

Published : Dec 08, 2020, 07:29 AM ISTUpdated : Dec 08, 2020, 08:05 AM IST
పెళ్లి ఊరేగింపులో.. వరుడిపై కాల్పులు

సారాంశం

పెళ్లి ఊరేగింపు హిరాన్ కుడ్నా సమీపంలోకి రాగానే కారులో వచ్చిన కొందరు దుండగులు వరుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరుడికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. 

పెళ్లి ఊరేగింపులో వరుడిపై అగంతకులు కాల్పులు కాల్పులు జరిపారు. ఒపెన్ టాప్ రథంలో కూర్చొని ఊరేగుతున్న వరుడిపై ఆగంతకులు కాల్పులు జరిపి గాయపర్చిన దారుణ ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో 27 ఏళ్ల వరుడు రామన్ వివాహవేడుక అనంతరం వీధుల్లో ఒపెన్ టాప్ జీపులో ఊరేగింపులో ఉన్నారు. పెళ్లి ఊరేగింపు హిరాన్ కుడ్నా సమీపంలోకి రాగానే కారులో వచ్చిన కొందరు దుండగులు వరుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరుడికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. 

గాయపడిన వరుడు రామన్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని పోలీసులు చెప్పారు. పెళ్లి ఊరేగింపులో కాల్పులతో కలకలం రేగింది. కాల్పులు జరిపిన వారిని పట్టుకునేందుకు పెళ్లి ఊరేగింపులో వరుడి బంధువులు ప్రయత్నించగా, వారు కారుతో ఒక వ్యక్తిని గాయపర్చి వేగంగా పారిపోయారు. వరుడిపై కాల్పులు జరిపి పారిపోయిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కాల్పులకు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu