మాస్క్ పెట్టుకోకపోతే అంతే సంగతులు.. ఆ వ్యాసం రాయాల్సిందే...

By AN TeluguFirst Published Dec 7, 2020, 4:46 PM IST
Highlights

కరోనా నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేయడానికి గ్వాలియర్ పోలీసులు కొత్త శిక్షలు కనిపెట్టారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు మాస్కు ధరించని వారిని అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపడంతో పాటు వారితో కరోనా మీద వ్యాసాలు రాయించనున్నారు. 

కోవిడ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం సూచించిన నియమనింధనలపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు గ్వాలియర్ లో ‘రోకో-టోకో’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా మెజిస్ట్రేట్ కౌశ్లేంద్ర విక్రమ్ సింగ్ వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో బాగంగా అధికారులు కరోనా నియమనిబంధనలను ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా మాస్క్ ధరించకుండా కనిపిస్తే వారిని బహిరంగ జైలుకు తరలించనున్నారు. 

అక్కడ వారికి కరోనా పట్ల అవగాహన కల్పించి కోవిడ్ పై వ్యాసం రాయించనున్నారు. ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేసి వారిని రూప్ సింగ్ స్టేడియానికి తరలించి వ్యాసాలు రాయించినట్లు అధికారులు వెల్లడించారు. 

click me!