కరోనాకు తండ్రి బలి.. కూతుళ్ల తలకొరివి, ఆపై చితి మంటల్లో దూకిన కుమార్తె

By Siva KodatiFirst Published May 5, 2021, 9:03 PM IST
Highlights

కరోనా విలయతాండవంతో భారత్‌ చివురుటాకుల వణికిపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పాజిటివ్ వచ్చిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.

కరోనా విలయతాండవంతో భారత్‌ చివురుటాకుల వణికిపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పాజిటివ్ వచ్చిన వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. దీంతో బెడ్‌లు, ఆక్సిజన్, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

ఇక ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం రోగుల బంధువులు చేస్తున్న ఆక్రందనలు కంటతడి పెట్టిస్తుండగా.. ఆసుపత్రుల మెట్లపై కుప్పకూలుతున్న వారి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చాలదన్నట్లు వైరస్‌తో మరణించిన వారిని చివరి చూపు చూసేందుకు అవకాశం లేకపోవడం, ఆత్మీయులను కోల్పోయామన్న బాధ వారిని మరింత కృంగదీస్తోంది. తాజాగా కోవిడ్‌తో తండ్రి మరణించడాన్ని జీర్ణించుకోలేక కుమార్తె కాలుతున్న చితిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

Also Read:కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి: ఏది బెస్ట్, ఏది ప్రభావవంతంగా ఉంటుందో ప్రతీతి తెలుసుకొండి..

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రాయ్‌ కాలనీకి చెందిన దామోదర్‌దాస్‌ శర్దా (73)కు ముగ్గురు కుమార్తెలు. ఆయన భార్య కొంత కాలం కిందట చనిపోయింది. ఈ క్రమంలో ఇటీవల దామోదర్‌దాస్‌కు కరోనా సోకడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

అక్కడ చికిత్స పొందుతుండగా దామోదర్ దాస్ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. కొడుకులు లేనందన కుమార్తెలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇదే సమయంలో పోలీసులు వారిస్తున్నా వినపించుకోకుండా దామోదర్‌దాస్‌ చిన్న కుమార్తె చంద్ర శర్దా శ్మశానానికి వెళ్లింది.

తమను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి చితికి నిప్పు పెట్టగానే అదిచూసి తట్టుకోలేకపోయింది. దీంతో అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా చితి మంటల్లోకి దూకింది. ఊహించని ఈ ఘటనతో షాక్‌కు గురైన అక్కడి వారు వెంటనే తేరుకుని మంటల్లోంచి ఆమెను బయటకు తీసి రక్షించారు. కానీ, అప్పటికే ఈ యువతి శరీరం 70 శాతం కాలిపోవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

click me!