
Green Comet Near Earth: వేల సంవత్సరాల తరువాత, విశ్వంలో ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన జరుగుతోంది. ఇది ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అదే ఆకుపచ్చ తోకచుక్క. అరుదైన ఆకుపచ్చ తోకచుక్క ఈ వారం భూమి సమీపంలోకి రానుంది. ఇప్పటికే ఇది భూమీకి దగ్గరగా వచ్చిందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీన్ని టెలిస్కోప్ ద్వారా చూడొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఆకాశం నిర్మలంగా ఉన్న ప్రదేశంలో ఉంటే ఈ అరుదైన దృశ్యాన్ని కళ్ల ద్వారా కూడా చూడవచ్చునని పేర్కొంది.
ఈ ఆకుపచ్చ తోకచుక్కకు సీ/2022 ఈ3 (జెడ్టీఎఫ్) అని నామకరణం చేశారు. ఇది శుక్రవారం (ఫిబ్రవరి 10), శనివారం (ఫిబ్రవరి 11) సాయంత్రం భూమి, అంగారకుడి కక్ష్యల మధ్య ప్రయాణించనుంది. అంగారక గ్రహం పక్కన ఫ్యాన్ స్పాట్ ఆకారంలో ఈ ఆకుపచ్చ తోకచుక్క కనిపిస్తుందని ఖగోళ పరిశోధకులు పేర్కొంటున్నారు.
50,000 సంవత్సరాల తరువాత భూమికి చేరువగా..
విశేషమేమిటంటే ఈ ఆకుపచ్చ తోకచుక్క సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో ప్రయాణించి 50 వేల సంవత్సరాల్లో ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. ఇది 50 వేల సంవత్సరాల క్రితం భూమికి దగ్గరగా వచ్చింది. భవిష్యత్తులో కూడా అదే విధంగా భూమికి చేరువగా వచ్చే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఈ తోకచుక్కను చూడటానికి ఇదే మనకు చివరి అవకాశం అన్నమాట..!
ఆకుపచ్చ తోకచుక్క చూడటానికి అనుకూల సమయం ఇదే..
50 వేల సంత్సరాల తర్వాత భూమికి దగ్గరగా వచ్చిన అరుదైన ఆకుపచ్చ తోకచుక్క ఖగోళ అద్బుతంగా అభివర్ణించిన శాస్త్రవేత్తలు.. ఈ తోకచుక్క ఫిబ్రవరి 1 రాత్రి భూమికి దగ్గరగా వచ్చింది, కానీ దానిని చూడటానికి ఉత్తమ సమయం ఇప్పుడు వచ్చిందని తెలిపారు. ఈ నెల మొదట్లో చంద్రుడి కాంతి అడ్డురావడంతో అది స్పష్టంగా కనిపించకపోగా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
శుక్రవారం రాత్రి అంగారక గ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదనే విషయం స్పష్టమవుతుంది. దీని తరువాత, ఇది భూమి కక్ష్య నుండి మార్గాన్ని శాశ్వతంగా మార్చగలదు. అప్పుడు మనం ఎప్పటికీ చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
గ్రీన్ కామెట్ అనే పేరు ఎందుకు వచ్చింది?
గత ఏడాదే ఈ ఆకుపచ్చ తోకచుక్కను కనుగొన్నారు. ఇది తోకచుక్క కావడంతో మన సౌరకుటుంబం ఆరంభం నుంచి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ఈ సమయంలో ఇది సూర్యుడికి చాలా దగ్గరగా వెళుతుంది. అందువల్ల ఇది చాలా వేడిగా మారుతుంది. ఈ కారణంగా, ఇది ఒక కాంతిని వదిలివేస్తుంది. ఈ తోకచుక్క వద్ద వచ్చే ఆపుపచ్చ వెలుతురు పుంజం కారణంగా దీనిని ఆకుపచ్చ తోకచుక్క గా పేర్కొంటున్నారు.