విద్యార్థి దుస్తులు విప్పించి.. ర్యాంప్ వాక్ చేయించి రికార్డు చేసిన టీచర్

By Nagaraju TFirst Published Oct 2, 2018, 8:14 PM IST
Highlights

 విద్యార్థులకు విద్యాబుద్ధు నేర్పుతూ సన్మార్గంలో నడిపించాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిందిపోయి వక్రమార్గాలు పడుతున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉపాధ్యాయులు వారికే సమస్యగా మారుతున్నారు.

గ్రేటర్ నోయిడా: విద్యార్థులకు విద్యాబుద్ధు నేర్పుతూ సన్మార్గంలో నడిపించాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిందిపోయి వక్రమార్గాలు పడుతున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉపాధ్యాయులు వారికే సమస్యగా మారుతున్నారు. ఇలా సభ్యసమాజం తలదించుకునే ఘటనలు నిత్యం ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా పదోతరగతి విద్యార్థితో బలవంతంగా దుస్తులు విప్పించి...ఆపై ర్యాంప్ వాక్ చేయించి ఆ మెుత్తాన్ని వీడియో షూట్ చేసి రాక్షసానందం పొందాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని దాద్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థి పరుపుపై నిద్రపోతున్నాడు. అయితే నలుగురు విద్యార్థులు ఆ ఆ పరుపుకావాలని అడిగారు. ఇచ్చేందుకు ఆ విద్యార్థి తిరస్కరించడంతో నలుగురు వెళ్లి ఓ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

విద్యార్థుల ఫిర్యాదు అందుకున్న 38ఏళ్ల ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ విద్యార్థి దగ్గరకు వచ్చాడు. తోటి విద్యార్థుల ముందుు ఆ విద్యార్థి దుస్తులు విప్పించి ర్యాంప్ వాక్ చేయించాడు. అంతేకాదు ఆ ర్యాంప్ వాక్ మెుత్తాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.  

తనకు జరిగిన అవమానంపై ఆ విద్యార్థి దాద్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్ స్ట్రక్టర్ ను అదుపులోకి తీసుకుని మెుబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇరువురు రాజీకి రావడంతో కేసు నమోదు చెయ్యలేదని పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడ్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. 
 

click me!