ఎన్నికల డ్యూటీ కాదు.. ముందు నాకు పెళ్లి చేయండి: ప్రభుత్వానికి టీచర్ లేఖ

By Mahesh K  |  First Published Nov 4, 2023, 3:00 PM IST

ఎన్నికల డ్యూటీకి తాను హాజరు కానని, ముందుగా తనకు పెళ్లి జరిపించాలని ఓ ప్రభుత్వ టీచర్ తనకు వచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. తన జీవితం అంతా భార్య లేకుండానే రాత్రులు గడపాల్సి వస్తున్నదని వివరించారు.
 


భోపాల్: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అదనపు పనికి సిద్ధం కావాల్సిందే. ఎన్నికల డ్యూటీ కోసం ముందుగా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇలాగే.. అక్టోబర్ 16, 17వ తేదీల్లో పోలింగ్ డ్యూటీ కోసం ట్రైనింగ్ ఉంటుందని, అందుకు హాజరవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓ టీచర్ ఆ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. ఎన్నికల డ్యూటీకి రాంరాం చెప్పాడు. ఇదేంటనీ, నిన్ను ఎందుకు సస్పెండ్ చేయవద్దు అని షోకాజ్ నోటీసులు ఆయనకు వచ్చాయి. ఆ నోటీసులకు సమాధానంగా సదరు ఉపాధ్యాయుడు పంపిన సమాధానం చర్చనీయాంశమైంది.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా అమర్‌పటన్‌లో మహుదార్ హైయర్ సెకడరీ స్కూల్‌లో 35 ఏళ్ల అఖలేశ్ కుమార్ సంస్కృతం బోధిస్తున్నారు. ఇతర ఉపాధ్యాయుల్లాగే ఆయనకూ పోల్ డ్యూటీకి హాజరవ్వాలని ప్రభుత్వ ఆదేశం వచ్చింది. అక్టోబర్ 16, 17వ తేదీన ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. అయితే, ఆయన ఆ సెషన్‌కు డుమ్మా కొట్టారు. అక్టోబర్ 27వ తేదీన ఆ ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు వచ్చాయి. అయితే, ఈ నోటీసులకు ఆయన వింతైన రీతిలో ‘పాయింట్ టు పాయింట్’ అని టైటిల్ పెట్టి సమాధానం ఇచ్చారు.

Latest Videos

undefined

Also Read : Telangana Assembly Elections: మందు బాబులకు షాక్.. ఆ మూడు రోజులు వైన్స్, బార్లు బంద్..

‘నా జీవితం అంతా భార్య లేకుండానే రాత్రులు గడపాల్సి వస్తున్నది. నా రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి. ముందుగా నాకు పెళ్లి జరిపించండి.’ మరో పాయింట్‌లో రూ. 3.5 లక్షలు వరకట్నంగా కావాలని, అవి క్యాష్ ఇచ్చినా పర్లేదని లేకుంటా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసినా సరేనని పేర్కొన్నారు. అలాగే, సింగ్రౌలి టవర్ లేదా రేవా జిల్లాలోని సమదరియాలో ఫ్లాట్ కోసం లోన్ శాంక్షన్ చేయాలని తెలిపారు. ‘ఇలాంటి స్థితిలో నేను ఏం చేయాలి? నాకు మాటలే లేవు. మీరు చెప్పండి. మీరు సముద్రమంతా జ్ఞానం కలవాళ్లు’ అని వివరించారు.

ఆయన కొలీగ్స్ ఈ సమాధానం గురించి స్పందిస్తూ.. ఆయన చాన్నాళ్లుగా పెళ్లి కోసం ఆలోచిస్తున్నారని, పెళ్లి కాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. అంతటి ఒత్తిడి ఉంటే తప్పితే ఎవరైనా అలాంటి లేఖ షోకాజు నోటీసుకు సమాధానంగా రాస్తారా? అని పేర్కొన్నారు.

click me!