కేరళలో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. చిత్రహింసలు పెట్టి చంపి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి..

By SumaBala Bukka  |  First Published Nov 4, 2023, 2:01 PM IST

ఈ కేసులో పోలీసులు 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన 26 రోజుల్లోనే విచారణ పూర్తయింది. నేరం జరిగి 100వ రోజున తీర్పు వెలువడింది.


కేరళ : మానవమృగాలు పెచ్చుమీరుతున్నారు. పసివారని కూడా చూడకుండా అభం, శుభం తెలియని చిన్నారులపై పాశవికంగా వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. అత్యంత దారుణంగా అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఓ హేయమైన ఘటన కేరళలోని ఎర్నాకులంలో వెలుగు చూసింది. 

కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడైన అస్ఫాక్ అస్లాం అనే వ్యక్తి దోషిగా తేలాడు. ఈ కేసులో ఎర్నాకుళం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె సోమన్ తీర్పు చెప్పారు. నవంబరు 9న శిక్షపై విచారణ జరగనుంది.

Latest Videos

ప్రియురాలి మోజులో భార్యపై దారుణం.. ప్రమాదంగా చిత్రీకరించిన వైనం!

అతనిపై అభియోగాలు మోపిన మొత్తం 16 సెక్షన్ల కింద అస్ఫాక్ అస్లాంను కోర్టు దోషిగా నిర్ధారించిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరారు. జూలై 28న వలస కుటుంబానికి చెందిన 5 ఏళ్ల బాలికను అస్ఫాక్ ఆలం కిడ్నాప్ చేశాడు. ఆమె మృతదేహం మరుసటి రోజు ఉదయం అలువా సమీపంలోని స్థానిక మార్కెట్ వెనుక బురదగా ఉన్న ప్రాంతంలో... గోనె సంచిలో కట్టి పడేసి దొరికింది. 

చిన్నారి చనిపోయేముందు చిత్రహింసలకు గురైనట్టు తేలింది. చంపే ముందు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన 26 రోజుల్లోనే విచారణ పూర్తయింది. నేరం జరిగి 100వ రోజున తీర్పు వెలువడింది.

click me!