విద్యార్థినులతో డబుల్ మీనింగ్ డైలాగులు, లైంగిక వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్...

Published : Dec 25, 2021, 12:51 PM IST
విద్యార్థినులతో డబుల్ మీనింగ్ డైలాగులు, లైంగిక వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్...

సారాంశం

ఇద్దరు ఉపాధ్యాయులు డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో పాటు.. తమను అనుచితంగా తాకారని, పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా తమకు కాల్ చేశారని విద్యార్థినులు ఆరోపించారు. శిశు సంక్షేమ శాఖ పాఠశాలలో బాలల సంరక్షణ మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాలికలు తమకు ఎదురైన లైంగిక వేధింపులను వెల్లడించారు.  

రామనాథపురం :  public school studentsను లైంగికంగా వేధించిన teacherని పోలీసులు అరెస్టు చేసిన ఘటన Tamil Nadu రాష్ట్రంలోని రామనాథపురంలో జరిగింది. రామనాథపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతులకు చెందిన 15 మంది బాలికలను గణితం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు 
Sexually harassement చేశారు.

ఇద్దరు ఉపాధ్యాయులు డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో పాటు.. తమను అనుచితంగా తాకారని, పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా తమకు కాల్ చేశారని విద్యార్థినులు ఆరోపించారు. శిశు సంక్షేమ శాఖ పాఠశాలలో బాలల సంరక్షణ మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాలికలు తమకు ఎదురైన లైంగిక వేధింపులను వెల్లడించారు.  

బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు సోషల్ సైన్స్ టీచర్ ను అరెస్టు చేశారు. రెండో నిందితుడైన గణితం టీచర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహిళా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం.. కుమార్తెను ఎత్తుకెళ్లాడని.. చితకబాది, మర్మాంగాలు కోసేశారు..

ఇలాంటి దారుణ ఘటనే అక్టోబర్ లో గుంటూరులో జరిగింది. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పాడు. guntur district సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ లో ఎంపిపిఎస్(ఉర్దూ) పాఠశాల నడుస్తోంది. ఈ స్కూల్లో హుస్సెన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే చదవు  చెప్పాల్సిన తరగతి గదిలోనే నీలి చిత్రాలను చూడటమే కాదు చిన్నారులకు చూపించి లైంగికంగా వేధించేవాడు. ఇలా చాలారోజులుగా అతడు blue films చూపించి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా వారు బయటకు చెప్పుకోలేకపోయారు. 

అయితే తాజాగా ఓ విద్యార్థిణి తలనొప్పిగా వుందని సాకులు చెప్పి స్కూల్ కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో తల్లి ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి బయటపెట్టింది. ప్రతిరోజూ బూతు సినిమాలు చూపించి వేధిస్తున్నాడంటూ టీచర్ హుస్సెన్ పాడుపనుల గురించి బయటపెట్టింది. దీంతో ఆమె మిగతా విద్యార్థిణులను కూడా ఆరాతీయగా తమను కూడా ఇలాగే వేధిస్తున్నాడని బయటపెట్టారు. 

మూడేళ్ల పాటు అతడిని వాడుకొని. ఫారిన్ తీసుకెళ్తానని నమ్మించి.. చివరికి ఏం చేసిందంటే ?

బాలికల తల్లిదండ్రులంతా కలిసి సదరు ఉపాధ్యాయున్ని ప్రశ్నించగా వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ నీచుడిని తమకు అప్పగించాలంటూ విద్యార్థిణుల తల్లిదండ్రులు, స్థానికులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.

విద్యాశాఖ అధికారులకు కూడా హుస్సెన్ వ్యవహారంపై సిరియస్ అయ్యింది. అతడిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని... లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu