జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

Published : Dec 25, 2021, 12:08 PM IST
జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

సారాంశం

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అలెర్ట్ అయిన బలగాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. 

jammu and kashmir లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొసాగుతోంది. శనివారం తెల్లవారుజామున జరిగిన encounterలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరుగుతున్న భీరక ఎన్ కౌంటర్ లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అలెర్ట్ అయిన బలగాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమయ్యారని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. 

ఇదిలా ఉండగా, ఈ నెల ఒకటో తారీఖున జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. డిసెంబర్ ఒకటిన jammu and kashmirలోని పుల్వామా మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం...

 ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిని గమనించిన టెర్రరిస్టులు ఫైరింగ్‌ జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కూడా కాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల కదలికలతో సైన్యం అప్రమత్తమైంది. స్థానిక ప్రజలను అలర్ట్‌ చేసింది. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నారు. దీంతో ఉగ్రవాదులు దాగి ఉన్నారేమోనని అణువణువూ గాలిస్తున్నారు. 

మృతుల్లో jaishe mohammed ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ తెలిపారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడని ఆయన వెల్లడించారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగాయి. దీంతో సీఆర్ఫీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీస్ బలగాలు ఉమ్మడిగా ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ  క్రమంలోనే గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో lashkar e taiba ఉగ్రవాద సంస్థ అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫోర్స్‌కు సంబంధించిన ముష్కరులు హతమయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?