భోపాల్‌లో డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలి ఓ ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం.. వైరల్ వీడియో ఇదే

Published : Mar 20, 2023, 07:15 PM ISTUpdated : Mar 20, 2023, 07:18 PM IST
భోపాల్‌లో డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలి ఓ ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం.. వైరల్ వీడియో  ఇదే

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూనే స్టేజీ పైనే కుప్పకూలిపోయాడు. కార్డియాక్ అరెస్టుతో మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం చెందారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ దీక్షిత్ ఊహించని రీతిలో మరణించారు. భోపాల్‌లో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూనే ఆయన కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో హిందీ పాటకు అతను ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.

ఈ ఒక్క రోజు రాత్రి మాత్రమే ఉన్నది జీవితం.. రేపు నీవు ఎక్కడో.. నేను ఎక్కడో అనే పాటకు అతను డ్యాన్స్ చేశాడు. అతనితో పాటు మరో ముగ్గురు నలుగురు డ్యాన్స్ చేస్తున్నారు. వారందరినీ వీడియో తీస్తుండగా.. కుమార్ దీక్షిత్ కుప్పకూలిపోయిన ఘటన కనిపించింది. 

ఇతరులతో హుషారుగా డ్యాన్స్ చేసిన సురేంద్ర కుమార్ దీక్షిత్ కొంత సేపటి తర్వాత అతను జోష్ తగ్గించి కొంత పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో వైపునకు నడుచుకుంటూ నిస్సహాయంగా నడుస్తూపోయాడు. అక్కడే తొణికిపోయి కింద పడ్డాడు. మోకాళ్ల మీద ఆగిన అతడిని ఇతరులు పట్టుకున్నారు. మిత్రులు అతనికి సహాయం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ, అవి విఫలమయ్యాయి.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు సీరియస్..

పోస్టల్ డిపార్ట్‌మెంట్ 34వ ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను మార్చి 13వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నది. భోపాల్‌లోని మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నది. చివరి మ్యాచ్ మార్చి 17వ తేదీన జరనుంది. మార్చి 16వ తేదీన కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అదీ డిపార్ట్‌మెంట్ ఆఫీసు ప్రాంగణలోనే ఈ ప్రోగ్రామ్ నిర్వహించింది. సురేంద్ర కుమార్ దీక్షిత్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ 11వ తరగతి చదువుతున్న బాలిక వృందా త్రిపాఠి కార్డియాక్ అరెస్టుతో స్కూల్‌లో కుప్పకూలిపోయింది. ఉషా నగర్ ఏరియాలోని స్కూల్‌లో ఆమె కూలిపోగా.. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్, ఇతర ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమె ప్రాణాలు దక్కలేవు.

PREV
click me!

Recommended Stories

Tourism : ఏమిటీ.. 2025 లో 135 కోట్ల పర్యాటకులా..! ఆ ప్రాంతమేదో తెలుసా?
Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu