చైనాకు ఇండియా మరో షాక్: 43 యాప్స్‌పై నిషేధం

Siva Kodati |  
Published : Nov 24, 2020, 05:47 PM IST
చైనాకు ఇండియా మరో షాక్: 43 యాప్స్‌పై నిషేధం

సారాంశం

కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు వాటిల్లేందుకు దోహదం చేస్తున్న అభియోగాలపై 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుబంధ ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ప్రారంభంలో జూన్ 29న ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ఏ కింద 59 మొబైల్ యాప్స్‌ను సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

వీటిలో ఎక్కువగా చైనీస్ యాప్‌లే. కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, వీ చాట్, లూడో వంటి యాప్‌లు భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయంటూ గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్