కరోనా సెకండ్‌ వేవ్‌.. రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

By AN TeluguFirst Published Nov 27, 2020, 10:08 AM IST
Highlights

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్ని నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ను పెంచాలని కోరుతూ... హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని హోంశాఖ తెలిపింది. 

అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం... కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్డౌన్ను విధించలేవు. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తారు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల నిబంధనలకు లోబడి అన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నిబంధనలు  డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా రెండో రోజు 40వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 44,489 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 93 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 87లక్షల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.66 శాతానికి చేరింది. మరణాల రేటు 1.46 శాతంగా ఉంది.  

దేశంలో ప్రస్తుతం నాలుగున్నర లక్షల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటివరకు లక్ష ముప్పైఐదు వేలమందికి పైగా మరణించారు. బుధవారం ఒక్కరోజే ఐదువందలమందికి పైగా మరణించారు. గత 24 గంటల్లో11లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించారని ఐసీఎంఆర్ ప్రకటించింది. అటు దేశ రాజధాని దిల్లీలో బుధవారం 5,246 కొత్త కేసులు నమోదయ్యాయి. 99మంది చనిపోయారు. 
 
click me!