వివాహేతర సంబంధం... ప్రియుడిని కట్టర్ మెషీన్ తో నరికి చంపి, శరీర భాగాలను ఊరంతా చల్లి...

Published : Sep 22, 2022, 12:13 PM IST
వివాహేతర సంబంధం... ప్రియుడిని కట్టర్ మెషీన్ తో నరికి చంపి, శరీర భాగాలను ఊరంతా చల్లి...

సారాంశం

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడని.. తమ వీడియోలో సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని ఓ మహిళ అతడిని అంతమొందించింది.   

తమిళనాడు : తమిళనాడు ఈరోడ్ లో దారుణం చోటుచేసుకుంది.  పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఓ మహిళ దారుణంగా అతమొందించింది. దుంగలు కట్ చేసే కట్టర్ మెషిన్ తో వ్యాపారిని నరికి చంపింది. అతని శరీర భాగాలను ముక్కలు, ముక్కలుగా చేసి వాటిని నగరంలో అక్కడక్కడా పడేసింది. మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  విచారణలో భాగంగా పోలీసులకు కోయంబత్తూరులో అక్కడక్కడ శరీరభాగాలు దొరికాయి.  ఇవి మిస్సింగ్ అయిన వ్యాపారివే అని గుర్తించడంతో ప్రధాన నిందితురాలు కవితతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ రోడ్ కు చెందిన ప్రభు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నెల 15వ తేదీ నుంచి అతను కనబడడం లేదని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులకు మృతుడికి కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. అయితే తనని పెళ్లి చేసుకో అని అడిగితే.. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియో లను సోషల్ మీడియాలో పెడతానని ప్రభు బెదిరించాడు. దీంతో ప్రభుని మిషన్ కట్టలతో నరికి చంపింది కవిత.  ఆ తర్వాత అతని శరీర భాగాలను అక్కడక్కడ పడేసినట్లు విచారణలో ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. 

రూ.500కోసం హత్య.. డ్రగ్స్ కొనుగోలు విషయంలో వివాదం, ముదిరి స్నేహితుడి హతం...

ఇదిలా ఉండగా, కర్ణాటకలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రియుని కోసం భర్తను చంపేసింది ఓ వివాహిత. ఒక టీవీ సీరియల్ ప్రేరణతో వివాహిత తన భర్తను చంపిన వైనం.. మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవల్లి ఎన్ఈఎస్  లేఅవుట్ లో నివాసముంటున్న శశి కుమార్ (30)ని భార్య నాగమణి(28),  ప్రియుడు హేమంత్ (25)లు కలిసి ఆదివారం రాత్రి హత్య చేశారు. 

కనకపురలో గార్మెంట్స్ కు వెళుతున్న నాగమణికి హేమంత్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.  ఇది తెలిసి భర్త ఆమెను పలుమార్లు మందలించాడు. మొబైల్ ఫోన్ లాక్కొని,, పనికి వెళ్ళవద్దని కట్టడి చేయడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. భర్తను తప్పిస్తే తమకు ఏ అడ్డూ ఉండదని  నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది.

ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్ ను పిలిపించుకుంది.  నిద్రపోతున్న పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు.  తర్వాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్ చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తరువాత ఎవరో దుండగులు ఇంట్లోకి చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నాడు..  కోడలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో నాగమణిని, ప్రియుడు హేమంత్ ను రిమాండ్ కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు.

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay Takes Charge At CM: తొలి రోజే అధికారులని పరుగులు పెట్టించిన విజయ్ | Asianet Telugu
Vijay First Signatures: సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ సంచలన సంతకాలు| Asianet News Telugu