
దేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ శనివారం అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5వ గ్లోబలైజ్డ్ ఎడ్యుకేషన్ ఫోరమ్‌లో ‘రీ విజిటింగ్ ది ఐడియా ఆఫ్ ఇంటర్నేషనలైజేషన్- గ్లోబల్ టు లోకల్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. విద్యారంగంలో భారత్ ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. అంతర్జాతీయంగా సంబంధిత పాఠ్యాంశాలతో కూడిన మల్టీ డిసిప్లేన్ విద్యావిధానాన్ని రూపొందించామని, ఇది ఉపాధి కల్పనకు దోహదపడుతుందన్నారు.
కన్నీటి సాగు.. ఒక్క మరఠ్వాడలోనే 2022లో 1,023 మంది రైతు ఆత్మహత్యలు
నేడు భారతదేశం అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన యువకులతో ప్రపంచానికి నాలెడ్జ్ సెంటర్‌గా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం - 2020 అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించి భారతదేశాన్ని గ్లోబల్ హబ్ గా మారుస్తుందని అన్నారు. అధ్యాపకులకు స్వయంప్రతిపత్తి ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వేదికను కల్పిస్తోందన్నారు.
ఉత్తర భారతాన్ని ముంచెత్తిన చలి.. దట్టమైన పొగమంచుతో విమానాల రాకపోకలు ఆలస్యం
ఎన్ఈపీ 2020 అమల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు సమగ్ర విద్యను అందించేందుకు అనువైన పాఠ్యప్రణాళిక, విద్యావిధానాన్ని రూపొందించడం ద్వారా మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఇటీవలి కాలంలో మన విద్యాసంస్థల్లో చదువుకునేందుకు 49 వేల మంది విద్యార్థులు భారత్ కు వచ్చారని, 10 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారని చెప్పారు. ముఖ్యంగా సార్క్, ఆఫ్రికా దేశాలకు భారత్ ప్రసిద్ధ గమ్యస్థానమని కేంద్ర మంత్రి తెలిపారు.
మెట్లపై నుంచి పడి యూపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత సుందర్‌లాల్ దీక్షిత్ మృతి
‘‘ నేడు భారతదేశం పెద్ద సంఖ్యలో సమర్థులైన యువతను కలిగి ఉంది. ప్రపంచ అభివృద్ధికి చోదక శక్తిగా మారగల నైపుణ్యం కలిగిన మానవ వనరుల మూలధనం మనకు ఉంది’’ అని సర్కార్ అన్నారు, భారతదేశం ఇప్పుడు ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ అంచున ఉందని, ఇది వైవిధ్యమైన విద్యా వ్యవస్థతో పరస్పర చర్య ద్వారా ఉత్తమ విద్యా, పరిశోధన పద్ధతుల వినికిడిని ప్రోత్సహిస్తుందని నొక్కి చెప్పారు.
తమిళనాడు కాంచీపురంలో దారుణం: బోయ్‌ఫ్రెండ్ ముందే విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్
అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అనేక భారతీయ ఉన్నత విద్యా సంస్థలను చేర్చడాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రపంచీకరణ అనేది స్థానికతను మార్చిన అత్యంత పరివర్తన శక్తులలో ఒకటి అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడూ సంస్కరణలు చేయడానికి, పరివర్తన చెందడానికి, కొత్త ఆలోచనలపై సానుకూలంగా ఆలోచించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గ్లోబలైజేషన్ లక్ష్యంలో భాగంగా ప్రతిష్ఠాత్మక భారతీయ సంస్థలు ఇప్పుడు ఆఫ్ షోర్ క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నాయని, భారతదేశం ఏదో ఒక రోజు గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్ గా మారుతుందని ఆయన అన్నారు.