Covid Vaccination in India: క‌రోనా వ్యాక్సినేష‌న్ కు 4 కోట్ల మంది దూరం.. ఒక్క డోస్ కూడా తీసుకోలేదంట‌.. 

Published : Jul 23, 2022, 12:58 PM IST
Covid Vaccination in India: క‌రోనా వ్యాక్సినేష‌న్ కు 4 కోట్ల మంది దూరం.. ఒక్క డోస్ కూడా తీసుకోలేదంట‌.. 

సారాంశం

Covid Vaccination in India: దాదాపు 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు జూలై 18 వరకు ఒక్క డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని అందుకోలేదు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు.  

Covid Vaccination in India: భార‌త్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌లో మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 200 కోట్లు పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ చేసింది. భార‌త్ ఈ ఘ‌న‌తను ఈ కేవ‌లం 18 నెలల్లో సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని కేంద్రం వెల్ల‌డించింది. జూలై 18 నాటికి దాదాపు 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కోవిడ్-19 వ్యాక్సిన్‌లో ఒక్క డోస్ కూడా తీసుకోలేదని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 

పార్ల‌మెంట్ వ‌ర్ష‌కాల స‌మావేశాల్లో భాగంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌శ్నించ‌గా.. ఆరోగ్య‌శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. జులై 18 వరకు ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో (సివిసి) మొత్తం 1,78,38,52,566 వ్యాక్సిన్ డోసులను (97.34 శాతం) ఉచితంగా అందించినట్లు ఆమె వ్రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఇదే స‌మ‌యంలో.. జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కోవిడ్ వ్యాక్సిన్‌లో ఒక్క డోస్ కూడా తీసుకోలేదని తెలిపారు.

ఈ ఏడాది మార్చి 16 నుంచి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు (HCWs), ఫ్రంట్‌లైన్ కార్మికులు (FLWs) మరియు 60 ఏళ్లు పైబడిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ CVCలలో, ఏప్రిల్ 10 నుండి 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ CVCలలో ముందస్తు జాగ్రత్త మోతాదులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.  ప్రభుత్వ ఇమ్యునైజేషన్ సెంటర్లలో 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ ముందస్తు జాగ్రత్త మోతాదులను అందించడానికి 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ జూలై 15 నుండి ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 

భారతదేశ స్వాతంత్య్ర  75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని .. కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్' ప్రచారం అర్హులైన వ్యక్తులలో COVID యొక్క ముందు జాగ్రత్త మోతాదులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. భారతదేశంలోని వయోజన జనాభాలో 98 శాతం, కోవిడ్-19 వ్యాక్సిన్‌లో కనీసం ఒక డోస్‌ను పొందారు, అయితే 90 శాతం మంది పూర్తిగా టీకాలు వేశారు.

23 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు 
 
అదే సమయంలో.. ఇప్పటివరకు 23 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలను (ABHA) అందించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 3.21 కోట్ల కార్డులను కేటాయించిన‌ట్టు.. ఉత్తరప్రదేశ్, బీహార్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ప్ర‌భుత్వం తెలిపింది. KYC (నో యువర్ కస్టమర్) ధృవీకరణతో అన్ని వయసుల వారికి ABHA నంబర్‌లను రూపొందించవచ్చని ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా నంబర్ అనేది 14-అంకెల ID, ఇది వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను, వైద్య పరీక్షలను ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న హెల్త్‌కేర్ ప్రొవైడర్‌లు ఆన్‌లైన్‌లో డేటాను యాక్సెస్ చేయవచ్చు. షేర్ చేయవచ్చు. ఈ సంఖ్యను సృష్టించడం స్వచ్ఛందమని పవార్ అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జనవరి 16,2021న ప్రారంభించింది. కేవలం 277 రోజుల్లోనే 100 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అత్యధిక వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. మొద‌టి స్థానంలో చైనా నిలిచింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు