భార్యపై భర్త స్నేహితుడి అత్యాచారం.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

By team teluguFirst Published Jul 23, 2022, 11:33 AM IST
Highlights

ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు భర్తకు చెప్పింది. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాల్సింది పోయి.. ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

వారిద్ద‌రూ భార్యా భ‌ర్త‌లు. భ‌ర్త స్నేహితుడు త‌ర‌చూ ఇంటికి వ‌చ్చేవాడు. అత‌డి చూపుల్లో తేడాని గ‌మ‌నించిన భార్య.. భ‌ర్తకు ఈ విష‌యం ప‌లు మార్లు చెప్పింది. అయినా కూడా భ‌ర్త ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో భ‌ర్త స్నేహితుడు అద‌ను చూసుకొని ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యం భ‌ర్తకు తెలిసింది. దీంతో ఆమెకు ట్రిపుల్ త‌లాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఆమె భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 

దేశ రాజధాని‌లో షాకింగ్ ఘటన.. రైల్వే స్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 27 ఏళ్ల మహిళపై ఆమె భర్త స్నేహితుడు అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. బాధితురాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆమె భ‌ర్త పని కోసం బయటకు వెళ్లినప్పుడు, జ‌హంగీరాబాద్ కు చెందిన అత‌డి స్నేహితుడు ఇంటికి వ‌చ్చాడు. భ‌ర్త‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చాన‌ని చెప్పారు. అయితే అదే స‌మ‌యంలో అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న 2021 సెప్టెంబర్ లో జ‌రిగింది. ఈ విష‌యం ఆమె భర్తను అత‌డి విష‌యం చాలా సార్లు చెప్పినా వినిపించుకోలేదు. ట్రిపుల్ తలాక్ ఉచ్చరించి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీంతో భోపాల్‌లోని గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం, ట్రిపుల్ తలాక్ ఆరోపణలపై మహిళ ఫిర్యాదు చేశార‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. 

బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ : పార్థ ఛటర్జీ ఎవరంటే...

కాగా.. బాధిత మ‌హిళ ఇండోర్‌కు ప్రాంతానికి చెందినది. దీంతో ఆమె మంగ‌ళ‌వారం తన నగరంలోని హీరా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే అక్క‌డ ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్‌ను న‌మోడు చేశారు. అనంత‌రం దానిని ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో ఉన్న గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ కు బ‌దిలీ చేశారు. ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా విడాకులు పొందిన బాధిత మహిళ ప్రస్తుతం ఇండోర్ లోనే నివసిస్తోంది. ఈ కేసులో విచార‌ణ సాగుతోంది. 

click me!