గుడ్‌న్యూస్: లాక్‌డౌన్ ఎత్తివేశాక విదేశాల్లో ఉన్న ఇండియన్స్ స్వదేశానికి

By narsimha lode  |  First Published Apr 28, 2020, 6:23 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ, డొమెస్టిక్ విమాన సర్వీసులను ఇండియా నిలిపివేసింది.


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయ, డొమెస్టిక్ విమాన సర్వీసులను ఇండియా నిలిపివేసింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు.. ఇతర దేశాల్లో నిలిచి ఉన్న ఇండియన్స్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు  కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.లాక్ డౌన్ ఎత్తివేయగానే విదేశాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయనుంది ఇండియన్ గవర్నమెంట్.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. దీంతో విదేశాల్లో ఉన్నవారు అక్కడే చిక్కుకుపోయారు. కొందరిని ప్రత్యేకంగా విమానాలను పంపి స్వదేశానికి తీసుకొచ్చారు. మరికొందరు అక్కడే ఉన్నారు.

Latest Videos

ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇండియన్లు ఉన్నారు. గల్ప్ దేశాల్లో కూడ ఉపాధి కోసం వలస వెళ్లిన వారు కూడ ఉన్నారు. వీరందరిని స్వదేశానికి రప్పించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. 

చదువుకొనేందుకు, ఉపాధి కోసం, ఉద్యోగాలు చేసేందుకు  పలువురు భారతీయులు విదేశాల్లో  ఉన్నారు. లాక్ డౌన్ కు ముందు పలు దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్లిన వారు కూడ చిక్కుకొన్న ఘటనలు కూడ లేకపోలేదు. 

విదేశాల్లో ఉన్నవారిని భారత్ కు రప్పించాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే విదేశాల్లో ఉంటూ ఇండియాకు రావడానికి ఆసక్తి చూపేవారి జాబితాను సిద్దం చేయాలని భారత రాయబార కార్యాలయాలకు కేంద్రం సమాచారం పంపింది. దీంతో ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ఆన్‌లైన్‌లో వివరాలను సేకరించి ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. 

also readలాక్‌డౌన్ ఎఫెక్ట్: రెండు సార్లు వాయిదా, కలెక్టరేట్‌లో నిరాడంబరంగా పెళ్లి

గల్ప్ దేశాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి తీసుకెళ్లాలని  ఆ దేశాలు కోరాయి. ఈ మేరకు దౌత్య పరంగా గల్ప్ దేశాలు ఇండియాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధి కోసం భవన నిర్మాణ కార్మికులుగా ఇతర పనుల్లో ఇండియన్లు ఉన్నారు.

click me!