ప్లాస్మా థెరపీ ప్రయోగమే, అధికారిక చికిత్స కాదు: కేంద్ర ఆరోగ్య శాఖ

By narsimha lodeFirst Published Apr 28, 2020, 4:46 PM IST
Highlights

కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా థెరపీ అనేది ఐసీఎంఆర్ అధికారిక చికిత్సగా గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా థెరపీ అనేది ఐసీఎంఆర్ అధికారిక చికిత్సగా గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

మంగళవారం సాయంత్రం న్యూడిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో కూడ ఏ దేశంలో కూడ ప్లాస్మా చికిత్స విషయమై గుర్తించలేదని ఆయన తెలిపారు. 

 ప్లాస్మా చికిత్స ఇప్పటికి కూడ ప్రయోగదశలోనే ఉందన్నారు. దీనిని ట్రయల్ ప్రాతిపదికనే ఉపయోగిస్తున్నామన్నారు. ప్లాస్మా థెరపీని సరైన మార్గంలో ఉపయోగించకపోతే రోగిలో చాలా సమస్యలు సృష్టించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గత 24 గంటల్లో 1,543 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 29,435కు చేరుకొన్నాయన్నారు.28 రోజులుగా 17 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని ఆయన చెప్పారు. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 1500 కి.మీ కాలినడకనే, స్వగ్రామానికి చేరుకొన్న గంటల్లోనే మృతి...

సూరత్ లో  డోర్ టూ డోర్ సర్వే నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 23 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు.గుజరాత్ రాష్ట్రంలో రెండు బృందాలు పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

గుజరాత్ రాష్ట్రంలో సహాయక చర్యలు బాగానే ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. అహ్మదాబాద్ లో  కూడ కేంద్ర బృందం పర్యటిస్తున్న విషయాన్ని చెప్పారు.
టెక్నాలజీని ఉపయోగించి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నామన్నారు. 
 

click me!