మందు బాబులకు ప్రభుత్వ కిక్: మార్కెట్లోకి పోషకాలతో కూడిన నాచురల్ లిక్కర్

By Sree sFirst Published Mar 23, 2020, 9:15 AM IST
Highlights

మందు తాగితే ఆరోగ్యం పాడయిపోతుందని, ముందుకు దూరంగా ఉండమంటారు. కానీ తొలిసారిగా మందును పోషకాహారా డ్రింక్ గా తీసుకురాబోతున్నారు. తేబోతోందెవరనుకున్నారు? స్వయంగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. 

కరోనా వైరస్ వల్ల దేశమంతా షట్ డౌన్ లో ఉండగా కొన్ని న్యూస్ మనకు చేరకుండానే ఉండిపోతున్నాయి. ముఖ్యంగా మందుబాబులకు ఆసక్తి కలిగించే ఒక న్యూస్ వారికి చేరకుండానే పోయింది. ఇక మీదట మందుబాబులను తలెత్తుకు తిరిగేలా చేసే న్యూస్ అది. 

మందు తాగితే ఆరోగ్యం పాడయిపోతుందని, ముందుకు దూరంగా ఉండమంటారు. కానీ తొలిసారిగా మందును పోషకాహారా డ్రింక్ గా తీసుకురాబోతున్నారు. తేబోతోందెవరనుకున్నారు? స్వయంగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. 

Also read: మనసుల్ని గెలిచిన నేతలు: మోడీ రెండోసారి, కేసీఆర్ తొలిసారి!

నమ్మకం లేదా అయితే మీరే తెలుసుకోండి! మనకు ఆల్కహాలిక్ డ్రింక్స్ లో రకరకాలు తెలుసు. కల్లు వంటి ప్రకృతి పరంగా వచ్చేవి అయితే వైన్ షాప్స్ లో దొరికే బీర్, విస్కీ మరికొన్ని. ఇప్పుడు ప్రభుత్వమే ప్రకృతి పరంగా దొరికే పూలను తీసుకొని వాటి నుండి లిక్కర్ తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 

అన్ని కుదిరితే వచ్చే నెలాఖరు నాటికి ఈ డ్రింక్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇంతకు ఈ డ్రింక్ కి ప్రభుత్వం ఒక పేరు కూడా పెట్టేసింది. "మహువా న్యూట్రి బెవరేజ్". ఇందులో 5 ఫ్లేవర్లను కూడా తీసుకురాబోతున్నారట. 

ఇంతకిది ఏమిటనే కదా, మన అడవుల్లో విరివిగా దొరికే ఇప్ప పూలు అందరికీ తెలిసే ఉంటాయి కదా, ఆ ఇప్పపూలనుండే ఈ మందును తయారు చేయబోతున్నారు. ఒక రకంగా మన మామూలు ఊర్లలో దొరికే ఇప్పసారా అన్నమాట. 

Also read: కరోనా కు మందు వచ్చేస్తుందన్న ట్రంప్: వాస్తవాలు ఇవీ...!

ఆ ఇప్ప సారాయి మీదనే రెండు సంవత్సరాల పాటి ఐఐటీ ఢిల్లీ కి చెందినవారు పరిశోధనలు చేసి దీన్ని చాలా స్వచ్ఛమైన పద్ధతుల్లో, అందులోని పోషకవిలువలు కాపాడుతూ... ఈ మందును తయారు చేసే పద్దతిని రూపొందించారు. 

పోషకవిలువలు ఏమిటని ఆశ్చర్యపోకండి, ఈ ఇప్పపూలతో అనేక విటమిన్స్, న్యూట్రియెంట్స్ దాగి ఉన్నాయి. సాధారణ పద్ధతుల్లో లిక్కర్ తాయారు చేస్తే అవి కోల్పోయే ప్రమాదముందని దానిపై పరిశోధనలు చేసి ఈ పద్దతిని రూపొందించారు. 

ఈ లిక్కర్ లో కాల్షియమ్ కూడా ఉండడం విశేషం. అందువల్ల రకరకాల ఫ్లేవర్స్ లో ఈ డ్రింక్ ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. ఇక్కడికొక్క ఆసక్తికర విషయం ఏమిటంటే... కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఒక ఆల్కహాలిక్ డ్రింక్ ను మార్కెట్ చేయబోతుంది. ప్రస్తుతానికి లైసెన్సు కోసం ఎదురు చూస్తున్నారు. 

ఒక్కాసారి గనుక తమకు లైసెన్స్ వస్తే... అమూల్ పాల బ్రాండ్ మాదిరిగా తమ బ్రాండ్ కూడా పాపులర్ అవుతుందని భావిస్తున్నారు. ట్రైబల్ మార్కెటింగ్ డిపార్టుమెంటు అధికారులు. ఈ మందు తయారీకి అవసరమైన ఇప్ప పూలను బస్తర్ అడవుల నుండి సేకరించనున్నారు. దీని ధర కూడా తక్కువే. ఫుల్ బాటిల్ 700 రూపాయలకు అమ్మనున్నట్టు తెలుస్తుంది. 

click me!