ప్రేమ జంట కష్టాలు: మూడుసార్లు పెళ్లి వాయిదా, సెప్టెంబర్‌లోనైనా పెళ్లి జరిగేనా?

By narsimha lodeFirst Published Mar 22, 2020, 4:30 PM IST
Highlights

వారిద్దరూ ప్రేమించుకొన్నారు. పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకొందామని ముహుర్తాలు నిర్ణయించారు. కానీ మూడు సార్లు  పెళ్లికి ముహుర్తాలు పెట్టుకొని రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఈ జంటకు

తిరువనంతపురం: వారిద్దరూ ప్రేమించుకొన్నారు. పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకొందామని ముహుర్తాలు నిర్ణయించారు. కానీ మూడు సార్లు  పెళ్లికి ముహుర్తాలు పెట్టుకొని రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఈ జంటకు. ఏదో ఒక రకమైన అడ్డంకి రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. మరోసారి ముహుర్తం కోసం ఈ జంట ఎదురు చూస్తోంది.

కేరళ రాష్ట్రానికి చెందిన  26 ఏళ్ల ప్రేమ్ చంద్రన్, 23 ఏళ్ల సాండ్రా సంతోష్ ప్రేమించుకొన్నారు. వీరిది కేరళలోని ఎర్నాకుళం. తమ ప్రేమ విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పారు. పెళ్లికి ఇరు కుటుంబాలు కూడ అంగీకారం తెలిపాయి. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకొన్నారు. 2018 మే 20వ తేదీన  పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు.

ఈ సమయంలోనే కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో సుమారు 17 మంది మృత్యువాత పడ్డారు.  దీంతో  ప్రేమ జంట పెళ్లిని వాయిదా వేసుకొంది. ఏడాది తర్వాత ఓనం పండుగ రోజున పెళ్లి చేసుకోవాలని ముహుర్తంగా నిర్ణయించుకొన్నారు. 

ఇదే సమయంలో కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు రావడంతో రెండోసారి పెళ్లిని వాయిదా వేసుకొన్నారు. ఈ నెల 20వ తేదీన పెళ్లికి ముహుర్తంగా నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. దీంతో రెండు రోజుల క్రితం జరగాల్సిన పెళ్లిని కూడ ఈ జంట వాయిదా వేసుకొంది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.


 

click me!