కేరళకు గూగుల్ చేయూత.. రూ.7 కోట్ల విరాళం

By sivanagaprasad KodatiFirst Published 28, Aug 2018, 4:53 PM IST
Highlights

భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు కదిలివస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, కార్పోరేట్ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ కూడా కేరళలో సహాయక చర్యల నిమిత్తం రూ.7 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గూగుల్ ఆగ్నేయ ఆసియా, ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ కేరళలో సహాయక చర్యల కోసం గూగుల్. ఆర్గ్, గూగుల్ సిబ్బంది కలిపి 1 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. 

Last Updated 9, Sep 2018, 11:06 AM IST