యువకులతో చనువుగా ఉంటోందని... అక్క పీక పిసికిన తమ్ముడు

Published : Aug 28, 2018, 04:28 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
యువకులతో చనువుగా ఉంటోందని... అక్క పీక పిసికిన తమ్ముడు

సారాంశం

యువకులతో చనువుగా ఉంటోందని సొంత అక్కను హత్య చేశాడు తమ్ముడు. మహారాష్ట్రలోని వాలివ్ పట్ణణానికి చెందిన ఓ యువతి స్థానిక యువకులతో చనువుగా ఉంటోంది. 

యువకులతో చనువుగా ఉంటోందని సొంత అక్కను హత్య చేశాడు తమ్ముడు. మహారాష్ట్రలోని వాలివ్ పట్ణణానికి చెందిన ఓ యువతి స్థానిక యువకులతో చనువుగా ఉంటోంది. దీనిని గ్రహించిన ఆమె తమ్ముడు ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా అక్కను హెచ్చరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటు చేసుకోవడం ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు.

అయినప్పటికీ అక్క ప్రవర్తన మార్చుకోకపోవడంతో చివరకు ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో అమ్మానాన్నలు పనికి వెళ్లిన సమయంలో చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అతను మైనర్ కావడంతో బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?