ముందస్తుకు వెళ్లిన వారెవ్వరూ గెలవలేదు.. కేసీఆర్‌కు జైపాల్‌రెడ్డి హెచ్చరిక

By sivanagaprasad KodatiFirst Published Aug 28, 2018, 3:32 PM IST
Highlights

ముందస్తుకు వెళ్లిన నేతలెవ్వరూ గెలిచిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విరసం నేత వరవరరావు అరెస్ట్‌ను ఖండించారు

ముందస్తుకు వెళ్లిన నేతలెవ్వరూ గెలిచిన దాఖలాలు లేవన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విరసం నేత వరవరరావు అరెస్ట్‌ను ఖండించారు.. ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు.. ముందస్తు ఎన్నికలు రావడం సంతోషమేనని... ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే ముందస్తుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.

ప్రధాని మోడీతో ఉన్న మిత్రత్వాన్ని దాచేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎవరు ప్రచారం చేయాలన్న దానిపై అధిష్టానం నిర్ణయిస్తుందని.. ప్రధాని మోడీని ఫ్రెంచ్ పాలకుడు 14వ లూయితో పోల్చారు జైపాల్ రెడ్డి. లూయి మాదిరిగానే ‘ నేనే రాజు.. నా నిర్ణయమే శిరోధార్యం ’ అనేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని.. రాఫెల్ డీల్‌లో మోడీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 

click me!