ఇస్రో పితామహుడు విక్రమ్ సారాభాయ్ కి డూడుల్ తో గూగుల్ నివాళి

By telugu teamFirst Published Aug 12, 2019, 11:31 AM IST
Highlights

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో భారత్ కు తిరిగి వచ్చి నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు ప్రారంభించారు.ఆ తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ లో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనకు ఉన్న ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించిన ఆయన.. ఇస్రో కి బీజం పడేలా చేశారు.  ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తలు,బ్రహ్మ ప్రకాశ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి వారి ప్రతిభను గుర్తించి వారి సహకారంతో అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు.

ఇస్రో( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పుడు దూసుకోవడానికి ఇస్రోనే కారణం. ఇటీవల చంద్రయాన్ 2ను నింగిలోకి పంపించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇపపుడు ఇన్ని విజయాలు సాధించి.. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతున్న ఇస్రో కి బీజం వేసింది మాత్రం ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్. 

నేడు( ఆగస్టు 12) విక్రమ్ సారాభాయ్  శత జయంతి. భారత అంతరిక్ష పితామహుడిగా పేరుగాంచిన విక్రమ్ సారాభాయ్ కి ... గూగుల్ ప్రత్యేకంగా డూడూల్ తో నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం..

విక్రమ్ సారాభాయ్ ఆగస్టు 12వ తేదీ, 1919 వ సంవత్సరం గుజరాత్ లో జన్మించారు. అహ్మదాబాద్ లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకున్న ఆయన అనంతరం కేంబ్రిడ్జి యూనివర్శిటీలో నేచురల్ సైనె్స్ లో పట్టా పొందారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో భారత్ కు తిరిగి వచ్చి నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు ప్రారంభించారు.

ఆ తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ లో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనకు ఉన్న ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించిన ఆయన.. ఇస్రో కి బీజం పడేలా చేశారు. ప్రముఖ అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తలు,బ్రహ్మ ప్రకాశ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి వారి ప్రతిభను గుర్తించి వారి సహకారంతో అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు.

భారత అణు కార్యక్రమాలను కూడా సారాభాయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన అంతరిక్ష రంగం చంద్రుడిపై ఉన్న ఓ పెద్ద క్రేటర్ కి 1973లో ఆయన పేరుతో నామకరణం చేయడం విశేషం. ఇటవల ఇస్రో నింగిలోకి పంపిన చంద్రయాన్ 2 లోని ల్యాండర్ కి విక్రమ్ అనే పేరు పెట్టి ఆయనకు ఘన నివాళులర్పించింది. నేడు ఆయన శత జయంతిని పురస్కరించుకొని ఇస్రో సంవత్సరం పొడవుగా అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ రోజు దేశంలోని 100 నగరాల్లో 100 రకాల కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. 
 

click me!