ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ-భువనేశ్వర్ రూట్ లో నిలిచిపోయిన రాకపోకలు..

Published : May 25, 2023, 01:52 PM IST
ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ-భువనేశ్వర్ రూట్ లో నిలిచిపోయిన రాకపోకలు..

సారాంశం

ఒడిశాలో ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-భువనేశ్వర్ మార్గంలో పలు రైళ్లను రెండు గంటలపాటు ఆపేశారు. 

పలాస : విశాఖ-భువనేశ్వర్ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలో ఈ ఘటన జరగడంతో విశాఖ-భువనేశ్వర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు ఇంజన్ ఒడిశాలోని ఛత్రపూర్- గంజాం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పిందని  రైల్వే అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులను తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా డివిజన్ సిబ్బంది చేపట్టారు.

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. శ్రీకాకుళం రోడ్,  పలాస, సోంపేట, ఇచ్చాపురంతో పాటు ఒడిశాలోని బ్రహ్మపుర, ఛత్రపూర్ స్టేషన్లో రైళ్లను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. సుమారు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం