ఒక వ్యక్తి అహం వల్ల పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కు రాష్ట్రపతి కోల్పోయారు - కాంగ్రెస్

Published : May 25, 2023, 12:58 PM IST
ఒక వ్యక్తి అహం వల్ల పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కు రాష్ట్రపతి కోల్పోయారు - కాంగ్రెస్

సారాంశం

కేవలం ఒక వ్యక్తి అహం వల్ల మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనం ప్రారంభించే అవకాశాన్ని కోల్పోయారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ట్విట్టర్ వేధికగా విమర్శలు చేశారు. 

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని మరింత ముమ్మరం చేసింది. ఓ వ్యక్తి అహం, సెల్ఫ్ ప్రమోషన్ కోరుకోవడం వల్ల తొలి గిరిజన మహిళా రాష్ట్రపతికి పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రారంభించే రాజ్యాంగ హక్కు లేకుండా చేసిందని కాంగ్రెస్ విమర్శించింది.  మోదీ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ ఈ దాడి చేయడం గమనార్హం.

వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి వై-కేటగిరీ భద్రత.. ఎందుకంటే ?

ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ‘‘రాంచీలోని జార్ఖండ్ హైకోర్టు కాంప్లెక్స్ లో దేశంలోనే అతిపెద్ద జ్యుడీషియల్ క్యాంపస్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అయితే ఒక వ్యక్తి అహంకారం, సెల్ఫ్ ప్రమోషన్ కోరిక వల్ల మే 28న న్యూఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే రాజ్యాంగ హక్కును తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి కోల్పోయారు.. అశోక ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, మోడీ ది ఇనాగ్రేట్’’ అని పేర్కొన్నారు.

కాగా..  కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తో సహా మొత్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ బహిష్కరణను ప్రకటించాయి. అందులో ‘‘ప్రజాస్వామ్య ఆత్మను పీల్చుకున్నప్పుడు కొత్త భవనంలో మాకు విలువ లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తీవ్రమైన అవమానం మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని, దీనికి తగిన ప్రతిస్పందన అవసరమం’’ అని 19 ప్రతిపక్ష పార్టీలు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకపోతే తమ పార్టీ హాజరుకాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

ప్రతిపక్షాల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూడా పదునైన ఎదురుదాడిని ప్రారంభించింది, ప్రతిపక్షాల వైఖరి మన గొప్ప దేశపు ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విలువలను తీవ్రంగా అవమానించడమే అవుతుందని పేర్కొంది. ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక ఘటన అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది రాజకీయాలకు సమయం కాదు... బహిష్కరించడం, కొత్త సమస్య నుంచి సమస్యలు సృష్టించడం అత్యంత దురదృష్టకరం. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !