పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.20వేలు

By ramya neerukondaFirst Published Nov 5, 2018, 4:24 PM IST
Highlights

 కేవలం పదోతరగి క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగం సంపాదిచవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పదోతరగతి పాసై.. 18నుంచి 25 ఏళ్ల వయసు మించని వారికి ఇది నిజంగా శుభవార్త. కేవలం పదోతరగి క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగం సంపాదిచవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రారంభ జీతం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. ఆఫీసుకు వచ్చేవారిని తనిఖీ చేయడం. ఫోన్ లో పై అధికారులకు సమాచారం ఇవ్వడం, పోస్టులు, పార్సిల్స్ పంపించడం, బుక్స్ లేదా ఫైల్స్ జాగ్రత్తగా భద్రపరచడం లాంటి పని ఉంటుంది.

ఈ ఉద్యోగం కావాలి అనుకుంటే.. ఆన్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ/ పీహెచ్‌ వారికి 10 సంవత్సరాలు వయఃపరిమితిలో మినహాయింపు ఉంది. అభ్యర్థులు విద్య, వ్యక్తిగత వివరాలతో దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ www.ssconline.nic.in లో  పూర్తి వివరాలు ఉంటాయి.

ఇంకెందుకు ఆలస్యంగా పైన చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేసి.. పూర్తి వివరాలను అందులో చూసేసి.. మీకు ఈ ఉద్యోగం సరైనదే అనిపిస్తే.. ప్రయత్నించి చూడండి. 

click me!