నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1056 పోస్టులకు యూపీఎస్ సీ నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలివే...

By SumaBala BukkaFirst Published Feb 21, 2024, 9:27 AM IST
Highlights

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1056 పోస్టుల కోసం UPSC CSE నోటిఫికేషన్ 2024ను విడుదల చేసింది. యూపీఎస్ సీ అర్హత ప్రమాణాలు, సిలబస్, పరీక్షా సరళి, పరీక్ష తేదీ, ఖాళీలు ఇతర వివరాలు ఇవే... 

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూపీఎస్సీ సీఎస్ సీ నోటిఫికేషన్ 2024ను విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024లో పాల్గొనాలనుకుంటే, అధికారిక వెబ్‌సైట్‌ లో, మార్చి 5లోపుఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయవచ్చు. 

యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ను  విడుదల చేసింది.  ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం 1056  పోస్టులను భర్తీ చేస్తారు. ఈ 1056 పోస్టులలో  ఐఏఎస్, ఐపీఎస్,  ఐఎఫ్ఎస్ సహా మొత్తం 21 ఉన్నత స్థాయి సర్వీస్ల పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టులను భర్తీ  చేయడానికి  ఎంపిక ప్రక్రియను యుపిఎస్సి చేపట్టబోతోంది. 

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటే… గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి  ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ  పాసై ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీకి సరిసమానమైన అర్హత కలిగి ఉండాలి. ఇందులో ఈ సంవత్సరం బ్యాచిలర్ డిగ్రీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం అప్లై చేసుకునేసరికి పరీక్ష పాస్ అయి ఉండాలి .

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 : ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా...

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలంటే… 2024,  ఆగస్టు ఒకటి నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక ఎస్సి, ఎస్టీ  వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు  ఉంటుంది. ఇక పరీక్షను ఓబీసీలు అయితే తొమ్మిదిసార్లు రాయొచ్చు. ఎస్సీ,  ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా పరీక్షలు రాయొచ్చు.

దరఖాస్తు అర్హతలకు లోబడి అప్లై చేసుకున్న తర్వాత ఎంపిక ప్రక్రియ మూడంచెలుగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్ ఎగ్జామినేషన్ కు అర్హత సాధిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధిస్తే పర్సనాలిటీ టెస్ట్ ద్వారా పోస్టుకు ఎంపిక చేస్తారు.

ఎలా, ఎక్కడ అప్లై చేసుకోవాలి…
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
2024 మార్చి ఐదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ
ఆన్లైన్ దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే సవరణకు కూడా అవకాశం ఉంది.
2024 మార్చి 6 నుంచి 12 వరకు సవరణ చేసుకోవచ్చు.
దీంట్లో అర్హులైన వారికి  2024 మే 26న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది
తరువాత మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజులు నిర్వహిస్తారు
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ http://upsc.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.  ఏదైనా అనుమానాలు ఉంటే ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలను చూసుకోవచ్చు.
 

click me!