Latest Videos

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్

By Galam Venkata RaoFirst Published Jun 14, 2024, 8:51 PM IST
Highlights

Aadhaar Update: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. ఆధార్ లో ఉచితంగా అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు మరో మూడు నెలలు గడువు పొడిగించింది.

Aadhaar Update: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆధార్‌ కార్డులో ఉచితంగా వివరాలు అప్డేట్‌ చేసుకునే గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (UIDAI) ప్రకటించింది. గతంలో ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియడంతో మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ ఏడాది (2024) సెప్టెంబర్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే అవకాశమిచ్చినట్లయింది. 

భారతదేశంలో ఆధార్ విశిష్టమైన గుర్తింపు పత్రం. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ప్రభుత్వ పథకాలు పొందడానికి.... ఇలా ప్రతిదానికీ ఆధార్ తప్పనిసరి. దీంతో ఆధార్‌ ప్రతి ఒక్కరికీ కీలకమైంది. అయితే, ఆధార్‌లో ఉండే వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వివరాలను సరిచేసుకునేందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) మరోసారి వెసులుబాటు కల్పించింది. 

ఆధార్ కార్డ్‌లో అడ్రస్  ఎలా అప్‌డేట్ చేయాలంటే..?
* మొదట అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ ని ఓపెన్  చేయండి 
* ‘MyAadhaar’ మెనూ నుంచి ‘Update Your Aadhaar’ ఆప్షన్ సెలెక్ట్  చేసుకొండి.
* ఆపై 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‌లైన్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఆధార్ కార్డ్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కోసం రీడిజైన్ చేయబడిన ఇంటర్‌ఫేస్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
* ఆధార్ అప్‌డేట్ చేయడానికి ప్రొసీడ్ ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకోండి.
* మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను రిజిస్టర్  చేసి, క్యాప్చా ఎంటర్  చేయండి
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్  చేయండి
* OTPని ఎంటర్ చేసిన తర్వాత మళ్లీ ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా’ అప్షన్ పై క్లిక్ చేయండి.
* అడ్రస్ మార్చడానికి ‘అడ్రస్’ అప్షన్ పై క్లిక్ చేయండి.
* కొత్త అడ్రస్  సమాచారాన్ని ఎంటర్ చేయండి. వాటితో పాటు కొత్త అడ్రస్ వెరిఫికేషన్  ప్రూఫ్స్  అప్‌లోడ్ చేయండి.
* మీ కొత్త అడ్రస్  సమాచారాన్ని ఎంటర్  చేయండి, అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. అందించిన సమాచారం సరైనదేనని మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
* సర్వీస్ కు సంబంధించిన ఏవైనా ఛార్జీలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి.
* చివరగా ఇప్పుడు మీరందుకున్న URNతో స్టేటస్  చెక్ చేయవచ్చు.

click me!