73rd Republic Day : ఈసారి రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డ్ ఎంతో ప్రత్యేకం తెలుసా..?

Siva Kodati |  
Published : Jan 26, 2022, 08:41 PM ISTUpdated : Jan 26, 2022, 08:48 PM IST
73rd Republic Day :  ఈసారి రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కార్డ్ ఎంతో ప్రత్యేకం తెలుసా..?

సారాంశం

కాగా.. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్డ్ దిగువ భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. 'Sow this card to plant an Amla plant' అని ఇంగ్లీష్‌లో రాశారు. ఈ ఇన్విటేషన్ కార్డును సీడ్ పేపర్‌తో తయారు చేశారు.

73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను (73rd Republic Day) భారతీయులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో (rajpath) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే రాష్ట్రాల రాజధానుల్లోనూ గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

కాగా.. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్డ్ దిగువ భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. 'Sow this card to plant an Amla plant' (ఈ కార్డును నాటండి.. ఇదొక ఉసిరి చెట్టు) అని ఇంగ్లీష్‌లో రాశారు. ఈ ఇన్విటేషన్ కార్డును సీడ్ పేపర్‌తో తయారు చేశారు. ఆ కాగితం ఉత్పత్తి ప్రక్రియలో కలిపిన ఎరువులు ఉపయోగించారు. కార్డు ముద్రించిన ఈ కాగితాన్ని ‘‘ప్లాంటబుల్ పేపర్’’ అని పిలుస్తారు. ఈ రకమైన కాగితం పర్యావరణానికి హాని కలిగించని విధంగా మట్టిలో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు