కరోనా భయం... గుడిలో దేవుడి విగ్రహాలకు మాస్క్ లు

By telugu news teamFirst Published Mar 10, 2020, 10:26 AM IST
Highlights

మరీ విచిత్రం ఏమిటంటే... ఆలయాల్లో స్వామివారి విగ్రహాలకు కూడా మాస్క్ లు పెట్టడం విశేషం. దేవుడి విగ్రహాలకు మాస్క్ లు పెట్టి.. భక్తులు ఎవరూ స్వామివారిని తాక రాదని పూజారులు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో చోటుచేసుకుంది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే చాలు ఎవరి ముఖానికి  చూసినా మాస్క్ లు దర్శనమిస్తున్నాయి. కరోనా రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అందరూ మాస్క్ లు వినియోగిస్తున్నారు. అయితే... ఈ మాస్క్ లు ఇప్పుడు దేవుడి గుడిలోనూ కనిపించడం గమనార్హం.

మరీ విచిత్రం ఏమిటంటే... ఆలయాల్లో స్వామివారి విగ్రహాలకు కూడా మాస్క్ లు పెట్టడం విశేషం. దేవుడి విగ్రహాలకు మాస్క్ లు పెట్టి.. భక్తులు ఎవరూ స్వామివారిని తాక రాదని పూజారులు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో చోటుచేసుకుంది.

Also Read కరోనా లక్షణాలతో అడుగుపెట్టాడు.. చికిత్స చేయించుకోకుండానే.....

పూర్తి వివరాల్లోకి వెళితే... వారణాసిలోని విశ్వనాథ్ ఆలయంలో శివలింగానికి పూజార్లు మాస్క్ లు ఏర్పాటు చేశారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించే క్రమంలోనే ఇలా చేశామని వారు చెప్పడం గమనార్హం.

చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు మన దేశానికి కూడా వ్యాపించింది. మన దేశంలోనూ 47మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు చేపట్టామని ఆలయ పూజార్లు తెలిపారు.

‘ కరోనావైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీని గురించి అవగాహన పెంచడానికే విశ్వనాథ్ స్వామి విగ్రహం మీద మాస్క్ ఉంచాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విగ్రహంపై వస్త్రాన్ని  ఉంచుతాం.. వేడిగా ఉన్న సమయంలో మాస్క్‌ను కడుతాం’ అని పూజరి పేర్కొన్నారు.


అలాగే విగ్రహాన్ని ఎవరూ తాకరాదని చెప్పారు.‘ చేతులలో విగ్రహాన్ని తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. భక్తులు స్వామివారిని చేతితో తాకితే.. కరోనావైరస్‌ ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది. కావున కొద్ది రోజుల వరకు భక్తులు విగ్రహాన్ని తాకరాదు’ అని పూజరి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైరస్‌ గురించి అక్కడి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. 

click me!