ఇకపై గోవా బీచుల్లో తాగితే10 వేల జరిమానా కట్టాల్సిందే..

By AN TeluguFirst Published Jan 9, 2021, 10:05 AM IST
Highlights

గోవా అంటేనే బీచులు, మందు పార్టీలే గుర్తుకువస్తాయి. తాగనివాళ్లు గోవా ఎందుకు వెళ్లడం అనికూడా అనుకుంటుంటారు. అయితే ఇకపై గోవాలో అలాంటివేం చెల్లవు. బీచుల్లో తాగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే. 

గోవాలోని బీచుల్లో తాగితే రూ.10 వేల జరిమానా విధించాలని గోవా పర్యాటక శాఖ తాజాగా నిర్ణయించింది. కొత్త సంవత్సర సంబరాల తర్వాత  అనేక ప్రాంతాలు తాగి పడేసిన బాటిళ్లతో నిండిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి శుక్రవారం తెలిపారు.

మరోవైపు బీచుల్లో తాగవద్దని హెచ్చరించే బోర్డులను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ మెనినో డిసౌజా చెప్పారు. బీచుల్లో తాగితే వ్యక్తులకు రూ.2 వేలు, బృందాలకు రూ.10వేల జరిమానా విధించేలా 2019లో రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్‌ ట్రేడ్‌ యాక్ట్‌ను సవరించినట్టు చెప్పారు. 
 
click me!