అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు 1,600 సిమ్‌కార్డులు

Published : Jan 09, 2021, 09:31 AM IST
అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు 1,600 సిమ్‌కార్డులు

సారాంశం

లోన్ యాప్ ల లీలలు రోజుకొకటి బయటడపడుతున్నాయి. తాజాగా అశ్లీల సంభాషణల కోసం ఏకంగా 1600 సిమ్ కార్డులు వాడిన విషయం సంచలనం రేపుతోంది. చైనా ముఠా లోన్‌ యాప్‌ ద్వారా పలు కోట్లు కందు వడ్డీ వసూలు చేసి ప్రజలను వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. డబ్బులు కట్టని వాళ్లను అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు లోను చేయడానికి నకిలీ దస్తావేజులతో 1,600 సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

చైనాకు చెందిన జియాఎమో (38), ఊయాన్‌లున్‌ (28), బెంగుళూరుకు చెందిన ప్రమోద (28), పవన్‌ (27) అనే వారి సహాయంతో వెంటనే లోన్‌ అందజేసే 50కి పైగా యాప్‌లు నడిపారు. వీటి ద్వారా కందు వడ్డీ వసూలుచేశారు. రుణాలు తిరిగి చెల్లించని వారిని మొబైల్‌ ఫోన్‌లో సంప్రదించి ఆశ్లీల పదజాలంతో బెదిరించేందుకు 110 మంది ఉద్యోగులతో నకిలీ కాల్‌ సెంటర్లు నడిపారు. 

వారిని ఈ నెల 2వ తేది చెన్నై కేంద్ర క్రైం విభాగం పోలీసులు అరెస్ట్‌ చేసి పుళల్‌ జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో, వీరికి చైనాకు చెందిన హాంగ్‌ అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. హాంగ్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా తన కింద పనిచేసే వారిని పర్యవేక్షిస్తు వచ్చాడు. ఇతని ఆధ్వర్యంలో చైనాకు చెందిన ఛీటింగ్‌ ముఠా పనిచేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. 

ఈ ముఠా బెంగుళూరు, చెన్నైలో కార్పొరేట్‌ ఉద్యోగుల పేరుతో నకిలీ ఆధారాలు అందజేసి 1,600 సిమ్‌ కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసేందుకు సహాయపడిన సమాచార శాఖ ఉద్యోగులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System