రూ.100 ట్వీట్ పై కంగనా కి లీగల్ నోటీసులు.. ట్వీట్ డిలీట్..!

By telugu news teamFirst Published Dec 5, 2020, 10:48 AM IST
Highlights

ఎంఎస్‌ మొహిందర్‌ కౌర్‌ని చూసి బిల్కిస్‌ బాను అనుకోని కంగనా ట్వీట్‌ చేసినందుకు లీగల్‌ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంటారు. ఇటీవల ఓ విషయంపై  స్పందించి ఆమె వివాదంలో చిక్కుకున్నారు. షహీన్‌ బాగ్‌ దాదీలలో ఒకరైన బిల్కిస్‌ బానోపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. నిరసనలలో కనిపించడానికి బిల్కిస్‌ బానో రూ.100 తీసుకుంటారని కంగన చేసిన ట్విట్‌పై దూమరం రేగింది. కాగా.. తీవ్ర దుమారం తర్వాత కంగనా.. తన ట్వీట్ ని తొలగించింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ' హా హా హా ఏ దాదీ అయితే అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్‌ మ్యాగజైన్‌లో చూసామో ఆమె ఇప్పుడు వంద రూపాయలకి నిరసనలలో అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాసంబంధ సంస్థను భారతదేశానికి సంబంధించి కాకుండా, పాకిస్తాన్‌కి సంబంధించి ఎంచుకున్నారు. ఇటువంటి వాటి గురించి అంతర్జాతీయంగా మాట్లాడటానికి సొంత వాళ్లు కావాలి' అని కంగనా ట్వీట్‌ చేశారు.

ఎంఎస్‌ మొహిందర్‌ కౌర్‌ని చూసి బిల్కిస్‌ బాను అనుకోని కంగనా ట్వీట్‌ చేసినందుకు లీగల్‌ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. ఇటీవల కంగనాకి లీగల్ నోటీసులు కూడా పంపించారు.

కంగనా భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా లీగల్ నోటీసులు పంపారు. కంగనా షేర్ చేసిన ఆ వృద్ధురాలి  చిత్రం ఓ రైతు తల్లిదని.. ఆ మాతృమూర్తిపై ఆమె చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్నారు.  కంగనా రనౌత్ రైతులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందని అన్నారు.  ఈ విషయం తీవ్ర దుమారం రేపకపోతే.. కంగనా తాను  చేసిన ట్వీట్ ని డిలీట్ చేశారు. 
 

click me!