టీవీ చూడనివ్వలేదని.. ఉరేసుకుని చనిపోయిన బాలుడు...

Published : Dec 05, 2020, 09:36 AM IST
టీవీ చూడనివ్వలేదని.. ఉరేసుకుని చనిపోయిన బాలుడు...

సారాంశం

చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని అంతం చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు కొప్పడితే చాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది.

చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని అంతం చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు కొప్పడితే చాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది.

టీవీ చూడనివ్వడం లేదనే కోపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పింప్రి చించ్‌వడ్‌లోని చిఖలీ ప్రాంతంలో జరిగింది. వివరాల ప్రకారం, రంజాన్‌ అబ్దుల్‌ శస్త్రక్‌ (13) ఎప్పుడూ టీవీ చూస్తుండటంతో వాళ్ల అమ్మ తిడుతూ ఉండేది. 

ఆ రోజు కూడా అలాగే కొప్పడింది. దీంతో మనస్థాపానికి గురైన అబ్దుల్‌ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రంజాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరో ఆస్పత్రికి తరలించారు. 

ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో రంజాన్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India