ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, పాలించి చూపిస్తా: మహారాష్ట్ర గవర్నర్ కు రైతు లేఖ

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 12:36 PM IST
Highlights

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడలే అనే రైతు ప్రత్యామ్నాయ మార్గం సూచిస్తూ మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశాడు. భాగస్వామ పార్టీల మధ్య కొట్లాట ముగిసి విభేదాలు పరిష్కారమయ్యేంత వరకూ తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్‌కు లేఖ రాశారు.

మహారాష్ట్ర:మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. సీఎం కుర్చీ నీదా నాదా సై అన్న చందంగా అటు బీజేపీ ఇటు శివసేన పార్టీలు రాజకీయంగా కొట్లాటకు తెరలేపాయి. దాంతో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. 

ఇకపోతే ఛాన్స్ వస్తే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కాంగ్రెస్, ఎన్సీపీ సైతం అవకాశం కోసం కాచుకు కూర్చోంది. సీఎం కుర్చీపై పీఠముడి వీడకపోవడం అటు ఉంచితే రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో రైతులు విసుగుచెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడలే అనే రైతు ప్రత్యామ్నాయ మార్గం సూచిస్తూ మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశాడు. 

భాగస్వామ పార్టీల మధ్య కొట్లాట ముగిసి విభేదాలు పరిష్కారమయ్యేంత వరకూ తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్‌కు లేఖ రాశారు. తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరారు.
 
ఇకపోతే ఆగస్టులో కురిసిన వర్షాలకు పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని, తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణం పనిచేసే ప్రభుత్వం కావాలని ఆ లేఖలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు రైతు.  

అకాల వర్షాలు రాష్ట్రంలో కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తుడిచిపెట్టేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వారికి అండగా నిలవాల్సిన సమయంలో సీఎం కుర్చీ విషయంలో బీజేపీ-శివసేన ఎటూ తేల్చుకోలుకుండా ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. 

సీఎం కుర్చీపై పీఠముడి వీడేవరకు సీఎం పదవి తనకు ఇవ్వాలంటూ గవర్నర్ కు సలహా ఇచ్చాడు రైతు శ్రీకాంత్ విష్ణు గడలే. రైతుల సమస్యలను ఒక రైతుగా తానే పరిష్కరిస్తానని నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తానని లేఖలో పేర్కొన్నారు.  

ఇకపోతే మహారాష్ట్రలో అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే సీఎం పీఠం ఎవరిదీ అనేదానిపై ఇంకా తేలలేదు. సీఎం కుర్చీపై బీజేపీ-శివసేనల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  

ఈ వార్తలు కూడా చదవండి

శివసేనకు కాంగ్రెస్ ఆఫర్: "పులి గడ్డి తింటుందా?"అంటూ బీజేపీ ఫైర్

అమిత్ షా స్ట్రాటజీ.. బీజేపీకి జైకొట్టిన దుష్యంత్: ఖంగుతిన్న కాంగ్రెస్

కలహాల కాపురం స్టార్ట్: కాంగ్రెస్, ఎన్సీపీలను పొగిడి.. బీజేపీని తిట్టిన శివసేన

click me!