టెక్కీ కొడుకు జైల్లో... తండ్రి శవం వద్దంటూ అమెరికాలోని కొడుకూ, ఇక్కడి కోడలు

By telugu teamFirst Published Oct 31, 2019, 2:10 PM IST
Highlights

తండ్రి చనిపోయిన విషయాన్ని పోలీసులు అమెరికాలోని శ్యామల్ ఛటర్జీ రెండో కుమారుడు బరీష్ కి ఫోన్ చేసి తెలియజేయగా... అతను ఇక్కడికి రావడానికి నిరాకరించాడు. తనకు పని ఉందని చెప్పడం విశేషం. స్థానిక మీడియా సంప్రదించినా కూడా వారు స్పందించకపోవడం గమనార్హం.

కోల్ కతాలో దారుణం చోటుచేసుకుంది. మాజీ ఐఏఎఫ్ అధికారి శ్యామల్ ఛటర్జీ(83) మృతి చెందారు. ఆయన చనిపోయి ఇప్పటికి 48 గంటలు అవుతున్నా... ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం విషాదకరం. ఒక కొడుకు జైల్లో ఉండగా... ఇంకో కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇద్దరూ కనీసం తండ్రి చనిపోయారనే బాధ కూడా వ్యక్తం చేయకపోవడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ్యామల్ ఛటర్జీ(83) ఐఏఎఫ్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు  కుమారులు. ఒక కుమారుడు చందు ఛటర్జీ టెక్కీ కాగా... ఇటీవల ఓ హత్య కేసులో అతను జైలుకి వెళ్లాడు. రెండో కొడుకు బరీష్ అమెరికాలో ఉన్నాడు. పోలీసులు ప్రస్తుతం శ్యామల్ ఛటర్జీ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి.. బంధువులు ఎవరైనా ముందుకు వస్తే వారికి అప్పగించాలని చూస్తున్నారు.

తండ్రి చనిపోయిన విషయాన్ని పోలీసులు అమెరికాలోని శ్యామల్ ఛటర్జీ రెండో కుమారుడు బరీష్ కి ఫోన్ చేసి తెలియజేయగా... అతను ఇక్కడికి రావడానికి నిరాకరించాడు. తనకు పని ఉందని చెప్పడం విశేషం. స్థానిక మీడియా సంప్రదించినా కూడా వారు స్పందించకపోవడం గమనార్హం.

వెంటనే జైల్లో ఉన్న చందు ఛటర్జీ భార్య స్నిగ్ధకి సమాచారం అందించగా... ఆమె కూడా స్పందించలేదు. ఆమె బెంగళూరులో ఉండగా.. కోల్ కతా రావడానికి నిరాకరించింది. ఇప్పటికే తన భర్త జైల్లో ఉన్నాడని... తనను ఇప్పుడు ఇందులోకి లాగొద్దని తాను అసలు కోల్ కతా రానని తేల్చిచెప్పింది.

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... సాధారణంగా పోస్టు మార్టం చేసి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేస్తామని అన్నారు. కానీ ఈ కేసులో సొంత కుమారుడు కూడా రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. 

వెంటనే అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న  శ్యామల్ ఛటర్జీ మేనల్లుడు కృష్ణుడు అతని భార్య సబిత తో పోలీసులు మాట్లాడారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత ఏడాది శ్యామల్ ఛటర్జీ భార్య చనిపోయినప్పుడు కూడా ఇలానే జరిగిందన్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఆమె మృతదేమాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నామని... నిదానంగా కొడుకులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు.

కనీసం అప్పుడు తమ మామ శ్యామల్ ఛటర్జీ ఉన్నారని.. ఇప్పుడు ఆయనకు కూడా అదే పరిస్థితి ఎదురైందని చెప్పాడు. కాగా... అతను కూడా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడం విశేషం. కొడుకులు వచ్చే వరకు ఎదురు చూద్దాం అంటూ చెప్పడం విశేషం. 

click me!