భారతదేశంలో GitHub డెవలపర్ల సంఖ్య అతి వేగంగా పెరుగుతోందని GitHub CEO థామస్ డోమ్కే పేర్కొన్నారు.
భారత్ లో టెక్నాలజీ డెవలపింగ్ పురోగతి వేగంగా ఉందనీ GitHub CEO థామస్ డోమ్కే అన్నారు. "భారతదేశంలో డెవలపర్ల సంఖ్య అతి వేగంగా పెరుగుతోంది. వారు AI సాయంతో AIని అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల తదుపరి పెద్ద బహుళజాతి సంస్థ భారతదేశం నుండి రావచ్చు" అని పేర్కొన్నారు.
India’s developers have gone a leap further: they’re increasingly using AI to build AI. India has the second-highest number of contributors to public generative AI projects.
This makes it evermore likely the next great AI multinational is borne on the continent. pic.twitter.com/Y8VpvNBc7X
— Thomas Dohmke (@ashtom)
GitHub ప్రముఖ డెవలపర్ల వేదిక. భారతదేశంలో 1.7 కోట్లకు పైగా డెవలపర్లు GitHubను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో భారతదేశం అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో 1.32 కోట్ల మంది GitHub డెవలపర్లు ఉండగా, ఈ ఏడాది 28 శాతం పెరిగారు. భారతదేశంలోని అధిక జనాభా, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ నైపుణ్యాలున్న విద్యార్థులే ఇందుకు కారణం.
GitHubకి భారతదేశం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ కూడా ఇదే. అమెరికాలో 2.2 కోట్లకు పైగా డెవలపర్లు ఉన్నారు. GitHub ఎడ్యుకేషన్ వినియోగదారుల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. పబ్లిక్ జెనరేటివ్ AI ప్రాజెక్టుల్లో భారతదేశం నుండి అత్యధిక మంది సహకరిస్తున్నారు. దీన్ని బట్టి భారతదేశం ప్రపంచ టెక్నాలజీలో ఎలా అగ్రగామిగా ఉందో అర్థం అవుతుంది.
GitHub CEO థామస్ డోమ్కే మాట్లాడుతూ, “మా అక్టోబర్ నివేదిక ప్రకారం, భారతదేశంలో డెవలపర్ల సంఖ్య అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశం ప్రపంచ టెక్నాలజీ దిగ్గజంగా ఎదుగుతోంది. భారతీయ డెవలపర్లు AI సాయంతో AIని అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల తదుపరి పెద్ద బహుళజాతి సంస్థ భారతదేశం నుండి రావచ్చు” అని అన్నారు.