
Gandhi Peace Prize: జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ప్రతి సంవత్సరం అందజేసే గాంధీ శాంతి పురస్కారం 2021 (Gandhi Peace Prize 2021)కి గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్ (Gita press)ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రకటనపై ఓ వైపు ప్రసంశలు వెల్లువిరుస్తుంటే..మరోవైపు.. విమర్శలు విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది.
ఈ వివాదం నేపథ్యంలో గీతా ప్రెస్ మేనేజ్‌మెంట్ కీలక ప్రకటన చేసింది. గాంధీ శాంతి బహుమతిని స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రైజ్ మనీపై గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లల్మణి తివారీ స్పందిస్తూ.. ఈ అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయలను (RS.1 crore)ను స్వీకరించబోమని , కేవలం జ్ఞాపికను మాత్రమే తాము స్వీకరిస్తామని, ఆ డబ్బును వేరే అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చని గీతాప్రెస్ మేనేజర్ తెలిపారు
ప్రధాని ప్రశంసలు
గాంధీ శాంతి బహుమతికి గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ను ఎంపిక చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. శాంతి, సామాజిక సామరస్యానికి సంబంధించిన గాంధేయ ఆదర్శాలను ప్రచారం చేయడంలో గీతా ప్రెస్ అందించిన సహకారాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారని ఆ ప్రకటన పేర్కొంది.
ఈ అవార్డుకు ఎంపికైనందుకు గీతా ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ రంగంలో దాని సేవలను ప్రశంసించారు. గీతాప్రెస్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవలో ఆ సంస్థ చేసిన కృషికి గుర్తింపు అని ప్రధాని మోదీ ఓ ట్వీట్‌లో గీతాప్రెస్‌కు అభినందనలు తెలిపాయి.
గీతా ప్రెస్ 1923 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణకర్తలలో ఒకటి, ఇది శ్రీమద్ భగవద్గీత యొక్క 16.21 కోట్ల కాపీలతో సహా 14 భాషలలో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. గాంధీ శాంతి బహుమతి అనేది మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో గాంధీ ప్రతిపాదించిన ఆదర్శాలను గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్షిక పురస్కారం. జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికైనా అవార్డు ఇవ్వవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణలు
2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని గీతా ప్రెస్ కు ప్రకటించడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. గీతా ప్రెస్‌కి గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రకటించడానికి గల కారణాలేంటని ప్రశ్నలు లేవనెత్తారు.
అదే సమయంలో..కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వీ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. గాంధీ శాంతి సమ్మాన్ ఇవ్వాలని నిబంధన ఉందని, దాని ఆధారంగా గీతా ప్రెస్ ఏం చేసిందని అల్వీ ప్రశ్నించారు. గీతా ప్రెస్‌లో గీత పేరు ప్రస్తావనకు రావడం తప్ప గీతా ప్రెస్ సహకారం ఏమిటన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ బజరంగ్ దళ్ నుంచి బజరంగ్ బలికి ఎలా మారిందో చూశామని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. బజరంగ్ దళ్, బజరంగ్ బలి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు.
మహాత్మా గాంధీని బీజేపీ ఏమాత్రం గౌరవించదన్నారు. బీజేపీ మంత్రులు మహాత్మా గాంధీని హంతకుడిని ప్రశంసించారు. బీజేపీ సభ్యుడు తనను తాను గాడ్సే అనుచరుడిగా చెప్పుకుంటున్నాడు. అదే సమయంలో ఓట్ల కోసం బీజేపీ మతాన్ని మాత్రమే రాజకీయాల్లోకి తెస్తోందన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని, మతం పేరుతో ఓట్లు అడుగుతుందని రషీద్ అల్వీ అన్నారు. ఈ దేశం సెక్యులర్ దేశం కాబట్టే గీతా ప్రెస్‌కి అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని అల్వీ అన్నారు. దేశంలో చాలా మంది ప్రచురణకర్తలు ఉన్నారు, కాబట్టి అందరికీ ఒకే అవార్డు ఇవ్వబడుతుంది. గీతా ప్రెస్ పేరులో గీత ఉన్నందున ఈ గౌరవం దక్కుతోందని అన్నారు.