ఉద్యోగం తెచ్చుకొమ్మంటే ఉరేసుకుని చనిపోయారు... ప్రేమజంట దారుణం...

By AN Telugu  |  First Published Dec 2, 2021, 7:38 AM IST

కర్నాటక రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటలు ఆత్మహత్యాయత్నం చేశాయి. ఇందులో ఓ జంట మృత్యువాత పడగా, మరోజంట చివరి నిమిషంలో కాపాడపడి కోలుకుంటోంది. వీరిద్దరూ తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతోనే ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే ఇందులో ఓ జంట మేజర్లు కాగా, మరో జంట మైనర్లు కావడం విశేషం. 


మైసూరు : కర్నాటకలో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన lovers ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. ఈ ఘటనలో చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీష్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

సతీష్ తో marriage వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తరువాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానని తెలిపాడు. బీఏ చదివిన సతీష్ police job కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీష్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి father సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమజంట మనస్తాపానికి గురైంది. 

Latest Videos

దీంతో మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్ లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి hang చేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్నారు. 

ఇక మైసూరులోనే మరో ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది. తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద ఈ ఘటన జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17యేళ్ల బాలిక ప్రేమించుకున్నారు.

బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 

చిరుత పులితో పోరాడి.. దాని చేతుల నుంచి బిడ్డను కాపాడుకున్న కన్నతల్లి.. గిరిజన మహిళపై ప్రశంసలు

ఇలాగే ఓ ప్రేమజంట నెలక్రితం విజయవాడలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన అరవింద్(25), నాగరాణి(21)కి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నేళ్లుగా వీరిద్దరు ప్రేమాయణం సాగుతోంది. ఇంతకాలం సాఫీగా సాగిన ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలని భావించారు. కానీ కుటుంబసభ్యులకు తమ ప్రేమ గురించి చెప్పి ఒప్పించే ధైర్యం చేయలేదు. 

కుటుంబసభ్యులు ఎక్కడ తమ ప్రేమను అంగీకరించకుండా పెళ్ళికి ఒప్పుకోరోనని భయపడిపోయిన ఈ ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు గన్న ప్రేమికులు చివరకు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

శనివారం రాత్రి అరవింద్, నాగరాణి పొలంపనుల కోసం దాచిన గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గుర్తించిన కుటుంబసభ్యులు guntur ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడి డాక్టర్లు వీరికి మెరుగైన చికిత్స అందించినా ఫలితంలేకుండా పోయింది.  ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఒకరు, సోమవారం తెల్లవారుజామున మరొకరు ప్రాణాలు కోల్పోయారు. 

click me!