ఢిల్లీ మెట్రో సిత్రాలు.. ట్రైన్‌ లోపల హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగిస్తూ ఓ యువతి.. వీడియో వైరల్

Published : Jun 18, 2023, 09:45 PM ISTUpdated : Jun 18, 2023, 09:46 PM IST
ఢిల్లీ మెట్రో సిత్రాలు.. ట్రైన్‌ లోపల హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగిస్తూ ఓ యువతి.. వీడియో వైరల్

సారాంశం

ఢిల్లీ మెట్రోకు సంబంధించి తాజాగా మరో వీడియో వైరల్ అయింది. కంపార్ట్‌మెంట్‌లో ఇతర ప్రయాణికులు ఉండగానే ఓ యువతి హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగించింది. అనతి కాలంలోనే ఈ వీడియోకు 1.60 లక్షల లైక్‌లు వచ్చాయి.  

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అదీ అందులో ప్రయాణికులు చేస్తున్న ఫీట్ల గురించి ఎక్కువగా వార్తలకు వస్తున్నది. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో వాదులాడుకోవడం, ఘర్షణపడటం, కిస్‌లు పెట్టుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇలాంటి సిత్రాలు ఎక్కువయ్యాక ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ వార్నింగ్ విడుదల చేసింది. మెట్రో ట్రైన్‌లో అభ్యంతరకర, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలు జారీ అయిన కొన్ని రోజుల తర్వాత మరో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఈ కొత్త వీడియోలో ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగిస్తున్నది. ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగించడం గమనార్హం. కానీ, సాటి ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నది. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

Also Read: కోల్‌కతా నైట్‌క్లబ్ పై నెటిజన్ల ఫైర్.. జంతువులపట్ల క్రూరత్వం అంటూ విమర్శలు.. కేసు నమోదు

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనతి కాలంలోనే 1.60 లక్షల లైక్‌ లు వచ్చాయి. కామెంట్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ఇది మెట్రో.. మీ ఇల్లు కాదు అంటూ పేర్కొన్నారు. మరొక యూజర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ మెట్రో కొత్త ట్యాగ్ లైన్ ఇలా పెట్టొచ్చు అని తెలిపారు. దీన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా వినియోగించుకోండి అనే ట్యాగ్ లైన్ ఢిల్లీ మెట్రోకు సరిపడుతుందని వివరించారు. మరొక ట్విట్టర్ యూజర్ దీన్ని మల్టి పర్పస్ ట్రాన్స్‌ పోర్టుగా పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్