మంచినీరు అనుకొని యాసిడ్ తాగిన బాలిక.. మృతి

By ramya NFirst Published Mar 7, 2019, 9:46 AM IST
Highlights

మంచినీరు అనుకొని యాసిడ్ తాగి ఓ బాలిక మృత్యువాత పడింది.  ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

మంచినీరు అనుకొని యాసిడ్ తాగి ఓ బాలిక మృత్యువాత పడింది.  ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని హర్షవిహార్ ప్రాంతంలోని దీప్ భారతి పబ్లిక్ స్కూలులో  సంజన నాలుగో తరగతి చదువుతోంది.  గురువారం క్లాస్ లో సంజన తన స్నేహితురాలితో కలిసి.. భోజనం చేస్తోంది. ఆ క్రమంలో బాలికకు కొరపోగా.. మరోబాలిక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది.

ఆ బాటిలో ఉన్నది వాటర్ కాదు.. యాసిడ్ అని తెలియక తాగేసింది. అనంతరం  బాలిక అరుపులు, కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో బాలికను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు.యాసిడ్ తాగిన సంజన శరీరంలో అంతర్గత గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 304 ఎ కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ అతుల్ కుమార్ చెప్పారు. బాటిల్ తోపాటు యాసిడ్ ను ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించారు.యాసిడ్ బాటిల్ ను పొరపాటున తీసుకువెళ్లిందని బాలిక తల్లి చెపుతోంది. ఈ ఘటన ఢిల్లీ పాఠశాలలో సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

click me!