పెన్షన్ కోసం వెళ్లిన మహిళపై ఎమ్మెల్యే అత్యాచారం

By Nagaraju penumalaFirst Published Mar 7, 2019, 7:53 AM IST
Highlights

గత ఏడాది డిసెంబరు నెలలో ఓ మహిళ తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యేను సంప్రదించగా..ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మళ్లీ నెలరోజుల తర్వాత ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ అదే మహిళపై తన కార్యాలయంలోనే అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది

ఢిల్లీ : ఢిల్లీలో మరో ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఓ మహిళపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చెయ్యడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

రితాలా నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనపై అత్యాచారం చేశాడని ప్రశాంత్ విహార్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన ప్రశాంత్ విహార్ పోలీసులు ఎమ్మెల్యే గోయల్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 509 ల కింద కేసు నమోదు చేశారు. 

ఢిల్లీ పోలీసు విభాగంలో మహిళాసెల్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో ఓ మహిళ తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యేను సంప్రదించగా..ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 

మళ్లీ నెలరోజుల తర్వాత ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ అదే మహిళపై తన కార్యాలయంలోనే అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసులో ఎమ్మెల్యేపై కేసు నమోదు చెయ్యడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.  
 

click me!