ట్రాఫిక్ సిగ్నల్‌ దగ్గర మోడల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. చివరికి ఏమైందంటే?

Published : Sep 15, 2021, 07:40 PM ISTUpdated : Sep 15, 2021, 07:42 PM IST
ట్రాఫిక్ సిగ్నల్‌ దగ్గర మోడల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. చివరికి ఏమైందంటే?

సారాంశం

ఓ మోడల్ ఉన్నట్టుండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్టెప్పులేసింది. ప్రయాణికులు ఒక్కసారి షాక్‌లోకి వెళ్లారు. 30 సెకండ్ల పాటు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ దగ్గర మోడల్ డ్యాన్స్ చేశారు.

ఇండోర్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే ఆమె జీబ్రా క్రాసింగ్ మీదకు వెళ్లింది. ఓ ఇంగ్లీష్ పాటకు స్టెప్పులేసింది. కార్లు, బైక్‌లపైనున్న ప్రయాణికులు ఆశ్చర్యంతో ఆమె డ్యాన్స్ చూస్తూ ఉండిపోయారు. కరోనా ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది కాబట్టి, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని అవగాహన కల్పించడానికి, రెడ్ సిగ్నల్ దగ్గర కచ్చితంగా వాహనాలు నిలపాలని తెలియజెప్పడానికే డ్యాన్స్ చేసినట్టు సదరు మోడల్ చెప్పుకొచ్చారు. కానీ, ఆ డ్యాన్స్ ఆమెను కష్టాల్లోకి నెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.

 

డ్యాన్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగానే విశేషాదరణ లభించింది. చాలా మంది ఆమె వీడియోను వీక్షించారు. కానీ, అందరూ సానుకూలంగా స్పందించలేదు. చాలా మంది విమర్శలు చేశారు. దీంతో ఆమె మరో పోస్టు చేసి వివరణ ఇచ్చుకున్నారు. తన ఉద్దేశం కేవలం మాస్కులు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే అవగాహన పెంచడమేనని వివరించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?