రోడ్డుపై రీల్ కోసం మహిళ షూటింగ్: చైన్ లాక్కెళ్లిన బైకర్

Published : Mar 25, 2024, 08:05 AM IST
రోడ్డుపై  రీల్ కోసం మహిళ షూటింగ్: చైన్ లాక్కెళ్లిన బైకర్

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో  మహిళ మెడలో నుండి  గొలుసును చోరీ చేశాడు దొంగ. బాధితురాలు  రీల్ కోసం వీడియో షూటింగ్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో  రీల్ కోసం  ఓ మహిళ వీడియోకు ఫోజులిస్తున్న సమయంలో  ఓ దొంగ బైక్ పై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఘజియాబాద్ ఇంద్రపురానికి చెందిన సుష్మ రీల్ షూటింగ్ కోసం  నవ్వుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అదే సమయంలో బైక్ పై  హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి సుష్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైన్ ను లాక్కెళ్లిన వ్యక్తి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన  చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇంద్రపురం ఏసీపీ స్వతంత్ర కుమార్ చెప్పారు.

 

 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్