అబ్బాయి పుట్టలేదని.. పసిబిడ్డను నేలకేసి కొట్టిన తల్లి..!

Published : Jul 03, 2021, 08:04 AM IST
అబ్బాయి పుట్టలేదని.. పసిబిడ్డను నేలకేసి కొట్టిన తల్లి..!

సారాంశం

బిడ్డను గోడకేసి కొట్టింది. అక్కడితో ఆగకుండా.. కాళ్లతో తొక్కేసింది. అప్పుడే పుట్టిన చిన్నారి జననాంగాలను తీవ్రంగా గాయపరించింది.

కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి అయినా అపురూపంగా చూసుకుంటుంది. కానీ.. ఓ మహిళ మాత్రం అతి కిరాతకంగా ప్రవర్తించింది. అబ్బాయి పుడతాడని ఆశపడితే.. అమ్మాయి పుట్టిందని అతి దారుణంగా ప్రవర్తించింది. బిడ్డను గోడకేసి కొట్టింది. అక్కడితో ఆగకుండా.. కాళ్లతో తొక్కేసింది. అప్పుడే పుట్టిన చిన్నారి జననాంగాలను తీవ్రంగా గాయపరించింది. అన్ని గాయాలతో ఆ చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కి చెందిన ఓ మహిళకు గతేడాది వివాహమైంది. వెంటనే గర్భం దాల్చగా.. జూన్ 21న ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తనకు ఆడపిల్ల పుట‍్టిందని జీర్ణించుకోలేకపోయింది. భర్త, అత్తమామలు మనకు దుర్గమ్మ పుట్టి, లక్ష్మీదేవి పుట్టిందని ఓదార్చే ప్రయత‍్నం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కుటుంబ సభ‍్యులు పాపాయికి ఏం పేరుపెడితే బాగుటుందోనని తెలుసుకునేందుకు పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తల్లి.. పసికందుపై దారుణానికి ఒడిగట్టింది. విచక్షణా జ్ఞానం మరిచి తీవ్రంగా గాయపరిచింది. కిందపడేసి కాళ్లతో తొక్కుతు రాక్షసానందం పొందింది. అయితే ఈ దాడి జరిగే సమయంలో ఇంట్లో పిల్లలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దారుణానికి ఒడిగట్టిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?