ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్ సింగ్ రాజీనామా?

By Siva KodatiFirst Published Jul 2, 2021, 8:18 PM IST
Highlights

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎంగా నియమితులైన నాటి నుంచి 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితిలో ఆయన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎంగా నియమితులైన నాటి నుంచి 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితిలో ఆయన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 5తో 6 నెలల గడువు పూర్తి కానుంది. మరో 6 నెలల్లో ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో.. తాజాగా ఉపఎన్నికల జరపలేని స్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం వుండటంతో తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయక తప్పని పరిస్దితి నెలకొంది.

ఉత్తరాఖండ్ సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో తిరథ్ సింగ్ రావత్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి బుధవారం ఉత్తరాఖండ్ బీజేపీ ఎల్పీ సమావేశంలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరథ్ స్పందించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని రావత్ స్పష్టం చేశారు. 56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం గర్హ్వాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకు చౌబ్తాఖల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

click me!